Home /News /international /

BIDEN ADMINISTRATION SUSPENDS ALL ARMS SALES TO TALIBAN HERE FULL DETAILS NS

Taliban: తాలిబన్లకు మరో షాక్ ఇచ్చిన అమెరికా.. కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా భారీ షాకిచ్చింది. ఆఫ్గనిస్తాన్ కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

    అఫ్గనిస్తాన్‌ ను ఆక్రమించుకుని ఆనందంలో మునిగి తేలుతున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా భారీ షాకిచ్చింది. ఆఫ్గనిస్తాన్ కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశానికి పంపకుండా పెండింగ్ లో ఉన్న, ఇంకా పంపిణీ చేయని ఆయుధాల బదిలీపై సైతం సమీక్షించనున్నారు. ఈ మేరకు అమెరికా రాజకీయ/మిలటరీ వ్యవహారాల బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్గాన్ లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం తదితర అంశాల ఆధారంగా పెండింగ్ లో ఉన్న, ఎగుమతి చేసిన ఆయుధాల లైసెన్స్ ల ఆమోదాన్ని డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్ సమీక్షిస్తుందని ప్రకటనలో వెల్లడించారు.
    Afghanistan: ఆఫ్గాన్ విమానం నుండి కింద పడ్డ ప్రయాణికులు, ఎక్కడ పడ్డారో తెలుసా...?

    ఇదిలా ఉంటే.. ఆఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనం తరువాత అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని అగ్రరాజ్యం గర్రుగా ఉంది. దీంతో తాలబన్ల ఆటకట్టించాలన్న లక్ష్యంతో బైడెన్‌ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్గాన్ కు సంబంధించిన రూ.70, 500 కోట్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. తాలిబన్లకు నిధులు చేరకుండా ప్రత్యేకమైన ఆంక్షలను అమెరికా విధించింది.

    తాజాగా అగ్రరాజ్యం అమెరికా తాలిబన్ల దూకుడుకు బ్రేక్ వేసింది. తాలిబన్లకు దక్కకుండా నిధులను స్తంభింప చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. కాబూల్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారికి నిధులు అందుబాటులో లేకుండా అమెరికా చర్యలు తీసుకుంటోంది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్‌ నిధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.5 బిలియన్‌ డాలర్ల మేర నిధులను నిలిపివేసింది.

    తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. తమ బ్యాంకుల్లోని అఫ్గన్‌ ప్రభుత్వానికి చెందిన ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవని పరిపాలనా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తాలిబాన్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు. ఇప్పటికే జర్మనీ డెవలప్‌మెంట్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Afghanistan, America, Joe Biden, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు