చైనా తుపాకులపై టిబెట్ సత్యమే గెలుస్తుంది.. దలైలామా

బీహార్‌లోని బోధ్ గయాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన చైనాపై విరుచుకుపడ్డారు. 15 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుత బోధ్ గయలో ఉన్నారు దలై లామా.

news18-telugu
Updated: December 25, 2019, 10:26 PM IST
చైనా తుపాకులపై టిబెట్ సత్యమే గెలుస్తుంది.. దలైలామా
దలై లామా
  • Share this:
చైనా ప్రభుత్వంపై టిబెటన్ ఆధ్యాత్మికవేత్త దలై లామా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చైనా వద్ద తుపాకులుంటే తమ వద్ద సత్యముందని..ఎప్పటికైనా సత్యానిదే విజయమని అన్నారు. బీహార్‌లోని బోధ్ గయాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన చైనాపై విరుచుకుపడ్డారు. దలైలామా మాట్లాడుతూ.. ''చైనా ప్రస్తుతం బౌద్ధుల దేశం. చైనీస్ బౌద్ధులు కూడా టిబెన్ బౌద్ధ మతాన్ని విశ్వసిస్తున్నారు. టిబెటన్లు అనుసరిస్తున్న బౌద్ధమే నిజమైదని వారు నమ్ముతున్నారు. చైనీస్ కమ్యూనిస్టులకు తుపాకుల శక్తి ఉండవచ్చు. కానీ మా వద్ద సత్యం అనే శక్తి వంతమైన ఆయుధ ఉంది. ఎప్పటికైనా తుపాకులపై సత్యమే విజయం సాధిస్తుంది. మతం పేరిట మనుషులను చంపుతున్నారు. అన్ని మతాలు ప్రేమ సందేశాన్నే ఇస్తాయన్ని విషయాన్ని వారు తెలుసుకోవాలి. మనమందరం మత సామరస్యాన్ని ప్రోత్సహించాలి.'' అని ఆయన అన్నారు. 15 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుత బోధ్ గయలో ఉన్నారు దలై లామా.
Published by: Shiva Kumar Addula
First published: December 25, 2019, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading