BERNIE SANDERS PREDICTED TRUMPS RESPONSE TO THE ELECTION NIGHT VIDEO MAKES WAVES BA
US Elections 2020: జ్యోతిష్యుడు కాకపోయినా అమెరికాలో అచ్చం ఆయన చెప్పినట్టే జరుగుతోంది
డొనాల్డ్ ట్రంప్.. (ఫైల్)
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారనే అంశాలకు సంబంధించి డెమొక్రటిక్ నేత, సెనేటర్ బెర్నీ సాండర్స్ ముందే చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారనే అంశాలకు సంబంధించి డెమొక్రటిక్ నేత, సెనేటర్ బెర్నీ సాండర్స్ ముందే చెప్పారు. ఆయన ఓ టీవీ షోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరగబోయే నాటకీయతను ఆయన ముందే ఊహించారు. ది టునైట్ షో విత్ జిమ్మీ ఫాలోన్ షోలో బెర్నీ సాండర్స్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈసారి ఊహించని స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు వస్తాయని చెప్పారు. దాని వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని కూడా ముందే చెప్పారు. ‘పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు వస్తాయి. ఫ్లోరిడా, వెర్మోంట్ లాంటి రాష్ట్రాల్లో వాటిని లెక్కించడం అంత సులువు కాదు. ఎన్నికల రోజు, ఆ తర్వాత రోజు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది.’ అని బెర్నీ సాండర్స్ చెప్పారు. ఆయన ఇంకో విషయాన్ని కూడా అంచనా వేశారు. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి.
‘ఎన్నికల రోజు రాత్రి 10 గంటలకు ట్రంప్ బయటకు వస్తాడు. మిచిగాన్‌లో గెలిచాం. పెన్సిల్వేనియాలో గెలిచాం. విస్కాన్సిన్లో గెలిచామని ప్రకటించినా ప్రకటించవచ్చు. తనను రెండోసారి ఎన్నుకున్నందుకు అమెరికన్లకు థాంక్స్ కూడా చెప్పొచ్చు.’ అని బెర్నీ సాండర్స్ చెప్పారు. ఆయన అంచనా వేసిన రెండు అంశాలు కచ్చితంగా అలాగే జరిగాయి. ఆయన చెప్పిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. దీని వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా సాండర్స్ చెప్పినట్టే ఎన్నికల రోజు రాత్రి 11 గంటలకు బయటకు వచ్చి తనను మరోసారి ఎన్నుకున్నందుకు థాంక్యూ అంటూ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ రకంగా ముందస్తు సంబరాలు చేసుకున్నారు.
సుదీర్ఘకాలం ఓట్ల కౌంటింగ్ జరపడంపై డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తాననే సంకేతాలను పంపారు. నార్త్ కరోలినాలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల రోజు రాత్రే తాను గెలిచినట్టు ప్రకటించుకోవడానికి సిద్ధం అయినట్టు ప్రశ్నించగా దానిపై స్పందించారు. ‘కాదు. కాదు. అది తప్పుడు రిపోర్ట్.’ అని అన్నారు. తన టీమ్ న్యాయపోరాటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. నార్త్ కరోలినా, పెన్సుల్వేనియాలో ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మీద ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అది సరికాదు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్స్ ఎలా తీసుకుంటారు.’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీని వల్ల చాలా ప్రమాదం జరుగుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి భవితను తేల్చగల నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఇలా చివరి నిమిషం ఓట్లను స్వీకరించడం మీద ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా లేట్ ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అలాగే, మెయిల్ ఇన్ బ్యాలెట్లలో ఫ్రాడ్ జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.
అమెరికాలో కరోనా కావడంతో చాలా మంది ఎన్నికల రోజు కంటే ముందస్తు ఓటింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మెయిన్ ఇన్ బ్యాటెట్లు కూడా చాలా వచ్చాయి. వాటిని లెక్కించడం ఆలస్యం అవుతోంది. కొన్నిసార్లు రోజులు, వారాల తరబడి కూడా పట్టొచ్చని చెబుతున్నారు. దీన్ని బట్టి ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటించడం సాధ్యం కాదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.