Video : పెట్టుబడుల కోసం పాకిస్థాన్ నక్కజిత్తులు... బెల్లీ డాన్సర్లతో షోలు

Pakistan : ఎవరైనా తమ దేశంలో విదేశీయులు ఎందుకు పెట్టుబడులు పెట్టాలో చెబుతూ... అక్కడి పరిపాలన, మౌలిక వసతులు, రోడ్ల వంటి వాటిని పరిచయం చేస్తారు. పాకిస్థాన్ మాత్రం బెల్లీ డాన్సర్లతో షోలు చేయిస్తూ... పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు యత్నిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 10:48 AM IST
Video : పెట్టుబడుల కోసం పాకిస్థాన్ నక్కజిత్తులు... బెల్లీ డాన్సర్లతో షోలు
బెల్లీ డాన్సులు (image : Twitter - GulBukhari)
Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 10:48 AM IST
మూలిగే నక్క తాటి చెట్ల కింద కూర్చోకూడదు. ఎందుకంటే తాడిపండు పడితే ప్రమాదం కాబట్టి. అలాగే... పాకిస్థాన్ లాంటి ఆర్థిక సమస్యల్లో ఉన్న దేశాలు... అడ్డదారులు తొక్కకూడదు. అది మరింత ప్రమాదం కాబట్టి. అజెర్‌బైజాన్‌లోని బాకులో సెప్టెంబర్ 4 నుంచీ 8 వరకూ జరిగిన పెట్టుబడుల సదస్సులో పాకిస్థాన్... బెల్లీ డాన్సర్లతో షోలు చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సదస్సును పాక్‌కి చెందిన సర్హాద్ వాణిజ్య మండలి నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో బెల్లీ డాన్సర్ల పెర్ఫార్మెన్స్ సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ప్రస్తుతం తీవ్ర అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్... చైనా, UAE, IMF వంటి సంస్థల నుంచీ ఆర్థిక సాయం కోరుతోంది. ప్రపంచంలో ఏ దేశమూ ఇలా బెల్లీ డాన్సర్లను ఎరవేసి... పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించట్లేదంటూ... నెటిజన్లు పాకిస్థాన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.


ఈ కాన్ఫరెన్స్‌లో బెల్లీ డాన్సర్ల పెర్ఫార్మెన్స్ సక్సెస్ అయ్యింది. వాళ్ల డాన్స్‌ని చాలా మంది పారిశ్రామిక వేత్తలు వీడియో తీసుకున్నారు. కొంతమంది ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ డాన్సులు వైరల్ అవుతున్నాయి. కానీ... ఆ సదస్సు వల్ల పాకిస్థాన్‌కి మాత్రం పెట్టుబడులు రాలేదు. ఇటీవలే UAE... పాకిస్థాన్‌కి 3 మిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది. త్వరలో IMF ఓ బృందాన్ని పాక్‌కి పంపబోతోంది. ఆ బృందం... అడ్డమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో సూచించనుంది. ఆల్రెడీ IMF పాక్‌కి 6 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎన్ని చేసినా... అసలు సమస్యైన ఉగ్రవాదాన్ని పాక్ అంతమొందించనంతవరకూ ఆ దేశానికి ఎవరెంత సాయం చేసినా... అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...