Video : ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటి... ఫ్రిజ్ డోర్ తీసి ఏం చేసిందంటే...

ఈ మధ్య ఎలుగుబంట్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అడవుల్లో తిరుగుతూ... ఆకులు, అలములు తినడం మానేసి... ఇళ్లపై పడి దోచుకుంటున్నాయి. ఇలా ఓ ఇంట్లో చొరబడిన ఎలుగుబంటి వేసిన వేషాలు... సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 10:01 AM IST
Video : ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటి... ఫ్రిజ్ డోర్ తీసి ఏం చేసిందంటే...
ఫ్రిజ్ డోర్ తీసిన ఎలుగుబంటి (Image - YT - ArkLaTex Homepage)
  • Share this:
కాలిఫోర్నియాలోని వేకేషన్ హోమ్ అది. అందులో 15 ఏళ్ల హాయెస్ షెర్మాన్ , 15 ఏళ్ల బాబీ హార్డెన్... టీవీ చూస్తూ ఉన్నారు. ఆ రాత్రి వేళ... కిచెన్ నుంచీ ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఇంట్లోకి దొంగలు చొరబడ్డారేమో అనుకున్న ఇద్దరు కుర్రాళ్లూ... దాక్కొని... దాక్కొని జాగ్రత్తగా వంట గదివైపు వెళ్లారు. చూస్తే... అక్కడో ఎలుగుబంటి ఉంది. ఆ టైంలో అది టాకో మీట్ (మాంసం), ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది. ఆ పక్కన ఫ్రిజ్ డోర్ తెరచివుంది. వెంటనే ఆ పిల్లలు... తిరిగి టీవీ రూంకి వెళ్లి... అమ్మా... పై అంతస్థులో ఉన్న తల్లికి కాల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కిందకు రావద్దనీ, పైన డోర్స్, విండోస్ క్లోజ్ చేసుకోమని చెప్పారు. వెంటనే ఆ పిల్లలు స్థానిక కౌంటీ అధికారికి కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన వచ్చి... షాట్ గన్‌తో కాల్పులు జరిపే సరికి... భయపడిన ఎలుగుబంటి... అక్కడి నుంచీ జారుకుంది. అది వెళ్లిపోయాక... సీసీ ఫుటేజ్ చూస్తే... అది ఇంట్లోకి రావడం, ఇంట్లో అన్నీ చెక్ చేస్తూ... మనుషులలాగా ఫ్రిజ్ డోర్ తెరవడం, తనకు కావాల్సినవి తీసుకోవడం అన్నీ రికార్డయ్యాయి.


ఇంతకీ ఆ ఎలుగు బంటి ఎలా వచ్చిందంటే... కిచెన్‌కి దగ్గర్లో గ్యారేజ్ డోర్ తెరచి ఉంది. దాన్లోంచీ ఇంట్లోకి వచ్చినట్లు అర్థమైంది. ఇకపై అన్ని డోర్లూ, కిటికీల డోర్లూ మూసి పెడతామని వాళ్లు తెలిపారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com