• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • BARBADOS PRIME MINISTER WRITES THANKS LETTER TO PM MODI FOR SENDING CORONA VACCINE HSN

వ్యవసాయ చట్టాలపై సెలబ్రెటీ ట్వీట్లకు చెక్.. మోదీకే థ్యాంక్స్ చెబుతూ లేఖ రాసిన ఆ దేశ ప్రధాని

వ్యవసాయ చట్టాలపై సెలబ్రెటీ ట్వీట్లకు చెక్.. మోదీకే థ్యాంక్స్ చెబుతూ లేఖ రాసిన ఆ దేశ ప్రధాని

ప్రధాని మోదీ, సింగర్ రిహానా (ఫైల్ ఫొటోలు)

వ్యవసాయ చట్టాలపై విదేశీ సెలబ్రెటీ, సింగర్ రిహానా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తే, అదే సమయంలో మరోవైపు బార్బేడియన్ ప్రధానమంత్రి మియా అమోర్ మోటర్లీ, మోదీకి థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేక లేఖ రాశారు. ఇంతకీ అసలు ఈ లేఖ అసలు కథేంటంటే..

  • Share this:
    దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలు కొత్త రూపు దాల్చుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. వారిలో రోబిన్ రిహానా ఫెనీ కూడా ఒకరు. కరేబియన్ దేశాల్లోని బార్బేడియన్ కు చెందిన ఆమె తన పాటల ద్వారా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే భారత్ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ధర్నాలకు ఆమె తన ట్వీట్ ద్వారా మద్దతు తెలిపింది. అయితే అంతర్జాతీయ నాయకులు, విదేశీ సెలబ్రెటీలు భారత అంతర్గత వ్యవహారంలోకి తలదూర్చడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ వైపు రిహానా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తే, అదే సమయంలో మరోవైపు బార్బేడియన్ ప్రధానమంత్రి మియా అమోర్ మోటర్లీ, మోదీకి థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేక లేఖ రాశారు. ఇంతకీ అసలు ఈ లేఖ అసలు కథేంటంటే..

    కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. మనదేశంలో కూడా రెండు కరోనా వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నారు. అదే సమయంలో పలు దేశాలకు కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా సరఫరా చేసి, అంతర్జాతియంగా ఘన ఖ్యాతిని భారత్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కరేబియన్ దేశమయిన బార్బేడియన్ కు కూడా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ పంపించింది. ఏకంగా లక్ష డోసుల వ్యాక్సిన్ ను ఆ దేశానికి భారత్ పంపించింది.

    Barbados, Prime Minister, writes, thanks letter, PM Modi, sending, Corona Vaccine, రైతు చట్టాలు, సెలబ్రెటీ, ట్వీట్లు, బార్బేడియన్ దేశం, ప్రధాని, మోదీ, లేఖ
    బార్బేడియన్ ప్రధానమంత్రి మియా అమోర్ మోటర్లీ


    తమ దేశానికి కరోనా వ్యాక్సిన్ ను పంపించడంపై బార్బేడియన్ దేశ ప్రధాని మియా అమోర్ మోటర్లీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత్ కు ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు. ’మీరు క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. పెద్ద మనసుతో మా దేశానికి వ్యాక్సిన్లను పంపిన మీకు, మీ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ వ్యాక్సిన్ ను మా దేశ ప్రజలకు ఉపయోగించవచ్చునని ఆరోగ్య శాఖ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలోనే మా దేశ ప్రజలకు ఈ వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభిస్తాం.‘ అని ఫిబ్రవరి 4న రాసిన ఆ లేఖలో మియా అమోర్ మోటర్లీ పేర్కొన్నారు. ఓ వైపు ఆ దేశ సెలబ్రెటీ ఏమో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తోంటే, మరో వైపు మోదీ ఏమో ఆమెతో సహా వారి దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను పంపారంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
    Published by:Hasaan Kandula
    First published: