శాంతాక్లాజ్ గెటప్‌లో ఒబామా..హాస్పిటల్‌లో చిన్నపిల్లలతో ఆటాపాటా

ఆస్పత్రిలో కొంత సమయం పాటు పిల్లలతో గడిపారు ఒబామా. వారితో ఆటలాడి..పాటలు పాడి సందడి చేశారు. స్వయంగా భుజాన గిఫ్ట్స్ బ్యాగ్ వేసుకొని ఆస్ప్రత్రికి రావడంతో..ఆస్పత్రి సిబ్బంది ఆశ్యర్యానికి గురయ్యారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

news18-telugu
Updated: December 20, 2018, 3:43 PM IST
శాంతాక్లాజ్ గెటప్‌లో ఒబామా..హాస్పిటల్‌లో చిన్నపిల్లలతో ఆటాపాటా
శాంతా క్లాజ్ గెటప్‌లో బరాక్ ఒబామా
  • Share this:
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సరికొత్త అవతారంలో సందడి చేశారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన..చిన్న పిల్లల కోసం క్రిస్మస్ తాతయ్యలా మారిపోయారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వెళ్లి చిన్నపిల్లలతో సరదాగా గడిపారు. బోలెడు బొమ్మలు, చాక్లెట్లు తీసుకెళ్లి..చిన్నారుల కళ్లల్లో ఆనందం నింపారు. ముందస్తు సమాచారం లేకుండానే సర్‌ప్రైజ్ విజిజ్ చేయడంతో..ఆస్పత్రి యాజమాన్యం సైతం ఉబ్బితబ్బిపోయారు.

ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బందికి నా ధన్యవాదాలు. అందమైన, అద్భుతమైన చిన్నారులతో ఆడుకునే అవకాశం కల్పించారు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా చిన్నారుల ఆరోగ్యం పట్ల మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నేను అర్ధం చేసుకోగలను.
బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

ఆస్పత్రిలో కొంత సమయం పాటు పిల్లలతో గడిపారు ఒబామా. వారితో ఆటలాడి..పాటలు పాడి సందడి చేశారు. స్వయంగా భుజాన గిఫ్ట్స్ బ్యాగ్ వేసుకొని ఆస్ప్రత్రికి రావడంతో..ఆస్పత్రి సిబ్బంది ఆశ్యర్యానికి గురయ్యారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. చిన్న పిల్లలతో ఒబామా గడిపిన దృశ్యాలను చిల్డ్రన్స్ నేషన్ అనే సంస్థ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒబామా సామాజిక స్పృహ, సేవా దృక్పథాన్ని అందరూ కొనియాడుతున్నారు.

కాగా, అమెరికాకు 44వ అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా.. ఇప్పటికీ వాషింగ్టన్‌లోనే నివసిస్తున్నారు. గత ఏడాది క్రిస్మస్ సంధర్భంగా ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులతో గడిపారు.
First published: December 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>