పాక్ విమాన ప్రమాదం... బయటపడిన బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో

పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన విమాన ప్రమాదం నుంచి బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈఓ జాఫర్ మసూద్ ప్రాణాలతో బయటపడ్డారు.

news18-telugu
Updated: May 22, 2020, 6:56 PM IST
పాక్ విమాన ప్రమాదం... బయటపడిన బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో
జాఫర్ మసూద్ (File:Image;Twitter))
  • Share this:
పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన విమాన ప్రమాదం నుంచి బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈఓ జాఫర్ మసూద్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న సమయంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన PK -8303 నెంబర్ గల విమానం కరాచీ విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో కూలింది. నివాస సముదాయాల మధ్యలో విమానం కూలింది. ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్టు ప్రాధమికంగా సమాచారం. విమానం కూలిన తర్వాత అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అందులో స్వల్ప గాయాలతో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో జాఫర్ మసూద్ కనిపించారు. ఆయన్ను వెంటనే దారుల్ షెహత్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని జియో న్యూస్ తెలిపింది. ఆయన తన తల్లికి కూడా ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్టు తెలియజేశారు. జాఫర్ మసూద్ తొడ ఎముక, మెడ ఎముక చిట్లినట్టు సమాచారం. శరీరం మీద కొన్ని కాలిన గాయాలు ఉన్నాయి. అక్కడక్కడ గీసుకుపోయిన గీతలు ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 22, 2020, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading