Home /News /international /

BANK CRISIS CHINA DEPLOYS TANKS AGAINST ITS CITIZEN PVN

China Crisis : చైనాలో సీన్ రివర్స్..పెద్ద ఎత్తున నిరసనలు,రంగంలోకి ఆర్మీ యుద్ధ ట్యాంకర్లు

చైనా వీధుల్లో ఆర్మీ ట్యాంకర్లు

చైనా వీధుల్లో ఆర్మీ ట్యాంకర్లు

Protests In China : చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను ఆందోళణకు గురిచేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఏప్రిల్‌ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్‌ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. షాంఘై హుమిన్‌ కౌంటీ బ్యాంక్‌, యుజౌ జిన్‌ మిన్‌షెంగ్‌ విలేజ్‌ బ్యాంక్‌, న్యూ ఓరియంటల్‌ కంట్రీ బ్యాంక్‌ ఆఫ్‌ కైఫెంగ్‌, జెచెంగ్‌ హువాంగ్వాయ్‌ కమ్యూనిటి బ్యాంక్‌, గుజెన్‌ జిన్‌హవాయ్‌ విలేజ్‌ బ్యాంక్‌లు తమ డిపాజిట్‌ దారుల ఖాతాలను స్తంభింపజేసినట్లు ప్రకటించాయి.

ఇంకా చదవండి ...
Protests In China : చైనా(China)లో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను ఆందోళణకు గురిచేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు(Banks) ఏప్రిల్‌ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్‌ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. షాంఘై హుమిన్‌ కౌంటీ బ్యాంక్‌, యుజౌ జిన్‌ మిన్‌షెంగ్‌ విలేజ్‌ బ్యాంక్‌, న్యూ ఓరియంటల్‌ కంట్రీ బ్యాంక్‌ ఆఫ్‌ కైఫెంగ్‌, జెచెంగ్‌ హువాంగ్వాయ్‌ కమ్యూనిటి బ్యాంక్‌, గుజెన్‌ జిన్‌హవాయ్‌ విలేజ్‌ బ్యాంక్‌లు తమ డిపాజిట్‌ దారుల ఖాతాలను స్తంభింపజేసినట్లు ప్రకటించాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చైనాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా అవి తీవ్రతరమయ్యాయి. బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆందోళనలను ఎలాగైనా అణచివేయాల జిన్‌పింగ్‌ సర్కారు ప్రయత్నిస్తోంది.ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

చైనాలో రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బతింది. ఫలితంగా 1600 చిన్న బ్యాంకులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు రియల్‌ఎస్టేట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా స్థిరాస్తి రంగ ప్రతికూల ప్రభావం మెల్లగా ఆర్థిక రంగంపై పడటం మొదలైంది. అదే సమయంలో డిపాజిట్లను స్తంభింపజేయడం ప్రజల్లో ఆందోళన పెంచింది. తాజాగా ది బ్యాంక్‌ ఆఫ్‌ చైనా బ్రాంచి ప్రజల డిపాజిట్లను పెట్టుబడులుగా మార్చినట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు బ్యాంకుల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని రిఝోలోని ఓ బ్యాంకు వద్ద రక్షణగా యుద్ధట్యాంకులు ఉన్న వీడియో వైరల్‌గా మారింది. చాలా ఇంగ్లీష్ పత్రికలు.. ఈ ట్యాంకులు బ్యాంకు రక్షణ కోసం వచ్చినవేనని కథనాలు ప్రచురించాయి. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం టియానన్‌మెన్‌ స్క్వేర్‌ మారణహోమం.

BJP Leader Farmhouse : ఫాంహౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు!ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్‌మెన్‌ స్క్వేర్‌ వద్ద 1989లో నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్‌ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది చైనా ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వేల మంది మరణించారని చెబుతారు. జూన్‌ 4వ తేదీకి టియానన్‌ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. తాజాగా మరోసారి స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. అది కూడా వారి సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా వాటిని రంగంలోకి దించింది. ట్యాంకుల మోహరింపు ఎలా ఉన్నా.. గ్రామీణ బ్యాంకులపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నది మాత్రం వాస్తవం. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఓ యాప్‌ ద్వారా చైనా ప్రభుత్వం ప్రజల డేటాను సమీకరించింది. తాజాగా ఆ యాప్‌ను ఉపయోగించుకొని పోలీసులు ఆందోళనకారుల ఫోన్లను ట్రాక్‌ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు