హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా ?.. అదే సంకేతమా ?

Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా ?.. అదే సంకేతమా ?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (ఫైల్ ఫోటో)

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (ఫైల్ ఫోటో)

Bangladesh: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ డాలర్లు వెచ్చించి విదేశాలకు తన వస్తువుల ఎగుమతులను తగ్గించుకోవడంతో ఆ దేశ ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది.

  భారత్ పొరుగు దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. శ్రీలంక తర్వాత పాకిస్థాన్, నేపాల్, మాల్దీవులు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేశాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, బంగ్లాదేశ్ వాషింగ్టన్‌లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి US $ 4.5 బిలియన్ల రుణాన్ని కోరింది. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని తెలియజేస్తుంది 2020 నాటికి బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రాబోయే కాలంలో జిడిపి పరంగా బంగ్లాదేశ్ భారత్‌ను అధిగమిస్తుందని చాలామంది అంచనా వేశారు. ఆ తర్వాత విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. గత ఆరేళ్లుగా బీజేపీ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని.. ఇదే తమ ఘనత అని గతంలో కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

  పాకిస్తాన్ నుండి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పేద దేశంగా ఉంది. కానీ క్రమంగా ఈ దేశం తన పరిస్థితులను అధిగమించింది. అయితే ఇప్పుడు మళ్లీ బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. నివేదికల ప్రకారం... బంగ్లాదేశ్‌లో దిగుమతి-ఎగుమతుల మధ్య అంతరం చాలా పెరిగింది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ నివేదిక ప్రకారం దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి. నివేదిక ప్రకారం, జూలై, 2021 మరియు మే 2022 మధ్య, $ 81.5 బిలియన్ల దిగుమతి జరిగింది.

  అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే, దిగుమతుల్లో 39 శాతం పెరుగుదల కనిపించింది. అంటే బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ డాలర్లు వెచ్చించి విదేశాలకు తన వస్తువుల ఎగుమతులను తగ్గించుకోవడంతో ఆ దేశ ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. అయితే తాము సహాయం కోరుతూ IMFకి లేఖ పంపామని.. కానీ మాకు ఎంత కావాలో పేర్కొనలేదని ఆ దేశ మంత్రి ముస్తఫా కమల్ అన్నారు.

  Yang Huiyan: ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఏడాదిలోనే ఆ బిలియనీర్ ఆస్తులు ఆవిరి.. చదివితే పాపం అంటారు !

  Kim Jong Un : కిమ్ తీవ్ర హెచ్చరిక..ఆ దేశాలపై అణుబాంబులు వేయడానికి సిద్ధం!

  అంతర్జాతీయ ద్రవ్యనిధి పరిస్థితులు దేశానికి అనుకూలంగా, అభివృద్ధి విధానానికి అనుకూలంగా ఉంటేనే తాము ఈ విషయంలో ముందుకు వెళతామని ఆయన అన్నారు. లేకపోతే ఆ ప్రతిపాదనను విరమించుకుంటామని చెప్పారు. IMF నుండి రుణం కోరడం అంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చెడ్డ స్థితిలో ఉందని కాదని వ్యాఖ్యానించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bangladesh

  ఉత్తమ కథలు