Home /News /international /

సీఏఏపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

సీఏఏపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఫైల్ ఫోటో(Reuters)

బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఫైల్ ఫోటో(Reuters)

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు.

    సీఏఏ భారత దేశ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను ఢిల్లీకి వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మతం కారణంగా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదని ఆ దేశం స్పష్టం చేసింది. అంతేకాదు భారత ప్రభుత్వం ఆ చట్టాలను ఎందుకు తెచ్చిందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అలాగే అవసరం కూడా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bangladesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు