పార్క్‌లో ముద్దులు.. ఆ సీన్ చూసి ఎంపీ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..

పార్కుల్లో తిరిగేవాళ్లపై చర్యలు తీసుకోవడం ఎంపీ చేయాల్సిన పని కాదని నెటిజెన్స్ విమర్శించారు.అయితే చౌదరి మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. భవిష్యత్తులోనూ ఇదే క్యాంపెయిన్ కొనసాగిస్తానని తెలిపారు.

news18-telugu
Updated: July 18, 2019, 7:17 AM IST
పార్క్‌లో ముద్దులు.. ఆ సీన్ చూసి ఎంపీ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగ్లాదేశ్‌కు చెందిన ఎక్రముల్ కరీం చౌదరీ అనే ఎంపీ ఓ టీనేజ్ ప్రేమజంట ముద్దు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేగింది. పార్క్‌లో వారిద్దరు ముద్దు పెట్టుకుంటున్న సమయంలో పోలీసులను పిలిపించి వారికి వార్నింగ్ ఇప్పించాడు.అనంతరం ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.దాంతో ఆ పోస్టుపై వేల కామెంట్లు పోటెత్తాయి.ఎంపీ చేసిన పనిని చాలామంది నెటిజెన్స్ విమర్శించారు. మోరల్ పోలిసింగ్ పేరుతో వారిని భయభ్రాంతులకు గురిచేయడమే కాక.. ఫోటోలను
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.

పార్కుల్లో తిరిగేవాళ్లపై చర్యలు తీసుకోవడం ఎంపీ చేయాల్సిన పని కాదని విమర్శించారు.అయితే చౌదరి మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. భవిష్యత్తులోనూ ఇదే క్యాంపెయిన్ కొనసాగిస్తానని తెలిపారు. అదే సమయంలో విమర్శలను కూడా తాను స్వీకరిస్తానని,లేదంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తనకు తెలియదని అన్నారు.ఏదేమైనా తన నియోజకవర్గంలో బహిరంగంగా పార్కులో ముద్దులు పెట్టుకోవడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని చెప్పారు. తాను పార్కులో నడుచుకుంటూ వెళ్తుండగా.. తన కళ్లముందే ముద్దులు పెట్టుకుంటున్నారని తెలిపారు.ఇదిలా ఉంటే, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ప్రేమ జంటను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.స్కూల్‌కి డుమ్మా కొట్టి ఇలా పార్కుల్లో తిరగవద్దని వారిని హెచ్చరించినట్టు చెప్పారు.
Published by: Srinivas Mittapalli
First published: July 18, 2019, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading