BANGLADESH GOVERNMENT ON THURSDAY ANNOUNCED STRICT LOCKDOWN WILL BE IMPOSED FROM JULY 23 SSR
Total Lockdown: అక్కడ ఇవాళ 8 గంటల నుంచి సంపూర్ణ లాక్డౌన్.. అన్నీ బంద్.. ఎప్పటివరకంటే..
ప్రతీకాత్మక చిత్రం
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 23 నుంచి బంగ్లాదేశ్‌లో రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచే ఈ లాక్డౌన్ అమలులోకి రానుంది. ఆగస్ట్ 5 వరకూ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఢాకా: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 23 నుంచి బంగ్లాదేశ్‌లో రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచే ఈ లాక్డౌన్ అమలులోకి రానుంది. ఆగస్ట్ 5 వరకూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ ఆంక్షలు అమలులో ఉండగా అన్ని రకాల ఆఫీసులు, పరిశ్రమలు, గార్మెంట్ ఫ్యాక్టరీలు మూసివేసి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్ బోర్డర్ల వద్ద కూడా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది. జులై 23 ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో విధించిన లాక్డౌన్ కంటే ఈసారి మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు మంత్రి ఫర్హాద్ హుస్సేన్ తెలిపారు. రోడ్లపై బంగ్లాదేశ్ పారా మిలటరీ బలగాలు, ఆర్మీ, పోలీసులు పహారా కాయనున్నట్లు పేర్కొన్నారు. బక్రీద్ నేపథ్యంలో ఎనిమిది రోజుల పాటు నిబంధనలను బంగ్లాదేశ్ సులభతరం చేసింది. కేసులు మళ్లీ పెరగడంతో లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. బుధవారం నాడు బంగ్లాదేశ్‌లో కొత్తగా 7,614 కరోనా కేసులు, 173 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆంక్షలు అమల్లో లేకపోతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది.
బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ఇప్పటివరకూ 11,36,503 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా 18,498 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 24,979 శాంపిల్స్‌ను పరీక్షించగా 7వేలకు పైగా పాజిటివ్‌గా తేలింది. అయితే.. బంగ్లాదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. బుధవారం 9,704 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,61,044కి చేరింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.