హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Bangladesh Ferry Fire: ఘోర ప్రమాదం.. నది మధ్యలో నౌక దగ్ధం.. 40 మంది ప్రయాణికులు సజీవ దహనం

Bangladesh Ferry Fire: ఘోర ప్రమాదం.. నది మధ్యలో నౌక దగ్ధం.. 40 మంది ప్రయాణికులు సజీవ దహనం

తగలబడుతున్న నౌక ( Image:Twitter)

తగలబడుతున్న నౌక ( Image:Twitter)

Bangladesh Boat Accident: మంటల్లో కాలిపోయి కొందరు మరణించగా.. నౌక నుంచి నదిలో దూకి పలువురు గల్లంతయ్యారు. మరికొందరు నీట మునిగి చనిపోయారు.

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం (Bangladesh Boat Fire) జరిగింది. సుగంధ నది (Sugandha River) మధ్యలో నౌక తగలబడింది. మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటనలో 40 మంది సజీవ దహమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢాకా 250 కి.మీ. దూరంలో ఉన్న ఝలకాతి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుఝామున 03.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

China: చైనాలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌.. జియాన్‌లో రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు

Mynmar landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 100

ప్రమాదానికి గురైన ఓబిజాన్ నౌక మూడంతస్తులు ఉంటుంది. అందులో 500కి పైగా ప్రయాణికులు ఉన్నారు. నౌక మొత్తం కిక్కిరిసిపోయంది. ఇది బార్గుణ నుంచి ఝలకాతి, భుయన్ మీదుగా ఢాకాకు వెళ్లాల్సి ఉంది. కానీ నౌక ఝలకాతి సమీపానికి చేరుకోగానే మంటలు చెలరేగాయి. మొదట ఇంజిన్‌ రూమ్‌లో మంటలంటుకున్నాయి. అక్కడే ఇంధనం ఉండడంతో పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అక్కడి నుంచి క్రమంగా ఇతర గదులకు వ్యాపించాయి. ఆ మంటలను చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు నదిలో దూకారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలను పంపించారు. కానీ అప్పటికే ఘోరం జరిగింది. మూడంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. నౌక నుంచి 42 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మరణించారు. మంటల్లో కాలిపోయి కొందరు మరణించగా.. నౌక నుంచి నదిలో దూకి పలువురు గల్లంతయ్యారు. మరికొందరు నీట మునిగి చనిపోయారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైత సహాయక చర్యలపైనే దృష్టి సారించారు.

First published:

Tags: Bangladesh, Fire Accident, International

ఉత్తమ కథలు