క్యా సూప్ హై.. 45 ఇయర్స్ ఓల్డ్.. టేస్ట్ అద్భుతహా..

Soup Has Been Cooking For 45 Years : నాలుగున్నర దశాబ్దాల నుంచి ఆ సూప్ తయారీకి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. బ్యాంకాక్‌లో ఓ కుటుంబం ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాము అలా చేయడం వల్ల సూప్‌కు ప్రత్యేకమైన రుచి,వాసన వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

news18-telugu
Updated: July 31, 2019, 11:42 AM IST
క్యా సూప్ హై.. 45 ఇయర్స్ ఓల్డ్.. టేస్ట్ అద్భుతహా..
వట్టనా పానిచ్ రెస్టారెంట్‌లో సూప్ వండుతున్న చెఫ్
  • Share this:
వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత బాగుంటుందంటారు.. ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ వైన్ లాగే సూప్ కూడా ఎంత ఓల్డ్ అయితే అంత బాగుంటుందంటే నమ్ముతారా..? మిగతా సూప్స్ సంగతేమో గానీ.. బ్యాంకాక్‌లోని వట్టనా పానిచ్ అనే రెస్టారెంట్‌లో తయారుచేసే సూప్ మాత్రం అంతే. ఆ సూప్ 45 సంవత్సరాల ఓల్డ్. ప్రతీరోజూ ఆ సూప్‌లో కొంతభాగాన్ని పాత్రలో అలాగే మిగిల్చి మరుసటిరోజుకు వాడుతారు. అలా నాలుగున్నర దశాబ్దాల నుంచి ఆ సూప్ తయారీకి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. బ్యాంకాక్‌లో ఓ కుటుంబం ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాము అలా చేయడం వల్ల సూప్‌కు ప్రత్యేకమైన రుచి,వాసన వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. తాజా మాంసం,బోటీని ఈ సూప్ తయారుచేసేందుకు వాడుతారు.
లోకల్‌గా ఈ సూప్ అక్కడ చాలా ఫేమస్. న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సూప్ పాపులర్ అయిపోయింది.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు