• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • BANGKOK THAILAND SHOOTING INCIDENT THAI SOLDIER KILLS 17 IN MASS SHOOTING LIVESTREAMS ATTACK

Thailand Shooting: థాయ్ ఆర్మీ జవాను ఉన్మాదం..17 మంది అమాయకులు హతం

Thailand Shooting: థాయ్ ఆర్మీ జవాను ఉన్మాదం..17 మంది అమాయకులు హతం

ప్రతీకాత్మక చిత్రం

Thailand shooting | థాయ్‌లాండ్ ఆర్మీ జవాను ఉన్మాదిలా రెచ్చిపోయాయి. అమాయక పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కోరట్ నగరంలో బీభత్సం సృష్టించాడు.

  • Share this:
    థాయ్‌లాండ్‌లో ఆ దేశ ఆర్మీ జవాను ఉన్మాదానికి పాల్పడ్డాడు. అమాయకులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించాడు. ఆటోమెటిక్ మిషన్ గన్‌తో జరిపిన కాల్పుల్లో కనీసం 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్ రాజధాని నగరం బ్యాంకాక్‌కు ఈశాన్యంలోని కోరట్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఉన్మాదిలా ఆర్మీ జవాను జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో కొందరు మృతి చెందగా...పలువురు గాయపడినట్లు ఓ పోలీసు అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ధృవీకరించారు. అయితే పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ధృవీకరించడం లేదు.

    కాల్పులు జరిపిన థాయ్ జవానును సెర్జియంట్ మేజర్ జకపంత్ తోమాగా పోలీసులు గుర్తించారు. ఆర్మీ వాహనాన్ని దొంగిలించిన అతను...అందులో ప్రయాణిస్తూ విచాక్షణారహితంగా అమాయకులపై కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఆర్మీ జవాను అక్కడి షాపింగ్ మాల్‌లో కొందరిని బంధీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.  ఆ షాపింగ్ మాల్‌ను పోలీసులు తమ దిగ్భందంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన జవాన్ను ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది.

    ప్రపంచంలో అత్యధికంగా తుపాకీ లైసెన్సు కలిగిన దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఒకటి. అయితే అమాయక పౌరులపై ఆర్మీ జవాను కాల్పులు జరిపిన ఘటనలు మునుపెన్నడూ లేవని పోలీసు అధికారులు చెబుతున్నారు.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు