1993 నుంచే యోగాపై అక్కడ నిషేధం.. తాజాగా మరో సంచలన నిర్ణయం.. ఇంతకీ అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

యోగాను ఒక మాంత్రిక విద్య అని భ్రమపడుతూ దాన్ని దూరం చేసుకుంటూనే ఉన్నారు. విద్యార్థులకు కూడా అందకుండా చేస్తున్నారు. అయితే అలాంటి ప్రాంతాల్లో కూడా క్రమక్రమంగా ఇప్పుడే మార్పు కనిపిస్తోంది. తాజాగా అమెరికాలోని..

 • Share this:
  ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగా ఉపయోగపడుతోందో ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే తెలుసుకున్నాయి. అయితే ఇంకా కొన్ని కొన్ని దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో యోగాపై నిషేధం అమలవుతూనే ఉంది. యోగాను ఒక మాంత్రిక విద్య అని భ్రమపడుతూ దాన్ని దూరం చేసుకుంటూనే ఉన్నారు. విద్యార్థులకు కూడా అందకుండా చేస్తున్నారు. అయితే అలాంటి ప్రాంతాల్లో కూడా క్రమక్రమంగా ఇప్పుడే మార్పు కనిపిస్తోంది. తాజాగా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. అలబామా రాష్ట్రంలోని స్కూళ్లలో యోగాపై నిషేధం అమల్లో ఉంది. స్కూళ్లల్లో యోగా కానీ, నమస్తే పెట్టించడం వంటివి కానీ చేయించకూడదని 1993లోనే ఓ చట్టం చేశారు. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది.

  తాజాగా అలబామా రాష్ట్ర సర్కారు యోగా ప్రాముఖ్యతను గుర్తించింది. స్కూలు విద్యార్థులకు యోగా ప్రయోజనాలు అందితే, వారు మెరికల్లా తయారవుతారని భావించింది. దీంతో గతంలో యోగాపై నిషేధం విధించిన చట్టాన్ని రద్దు చేసేందుకు తాజాగా మరో చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్నిపై సభలో ఓటింగ్ కూడా జరిగింది. 73-25 మెజారిటీతో ఆ బిల్లు నెగ్గింది కూడా. యోగాను తమ స్కూళ్లో నిర్వహించాలా? వద్దా? అన్నది స్కూలు యాజమాన్యమే నిర్ణయించుకునేలా ఈ చట్టం రూపొందింది.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  చర్చ సందర్భంగా చట్టసభలో సభ్యులు యోగా గురించి మాట్లాడారు. ‘యోగా అనేది మన వద్ద నిషేధంలో ఉందని జిమ్ టీచర్లందరికీ తెలుసు. అయితే ఈ యోగా ప్రాముఖ్యం గురించి తెలిసి కొందరు జిమ్ టీచర్లు క్లాస్ రూమ్లో పిల్లలతో యోగా చేయిస్తున్నారని నాకు తెలుసు. దీని వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోంది.‘ అని డెమోక్రటిక్ నేత జెర్మీ గ్రే తెలిపారు. తాను కూడా ఏడేళ్లుగా యోగాను చేస్తున్నాననీ, అది తన మనసుకు హాయిన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పలువురు సభ్యులు కూడా ఇదే రీతిలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
  ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా సౌదీలోనే.. హైదరాబాద్ కు శాశ్వతంగా తిరిగొస్తుండగా భర్త మృతి.. కనీసం అస్థికలనైనా ఇప్పించండంటూ భార్య కన్నీటి విన్నపం
  Published by:Hasaan Kandula
  First published: