Karima Baloch: అనుమానస్పద స్థితిలో బెలూచిస్తాన్ యాక్టివిస్ట్ కరీమా మృతి..

కరీమా బెలోచ్ (Karima Baloch)

పాకిస్తాన్ నుంచి తప్పించుకుని కెనడాలో ఆశ్రయం పొందుతున్న కరీమా బెలోచ్‌ శమమై కనిపించారు.

  • Share this:
    పాకిస్తాన్ నుంచి తప్పించుకుని కెనడాలో ఆశ్రయం పొందుతున్న కరీమా బెలోచ్‌ శమమై కనిపించారు. టొరంటోలోని లేక్‌షోర్ సమీపంలోని హార్బర్ ఫ్రంట్ వద్ద ఆమె మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆమె కనిపించకపోవడంతో స్థానిక పోలీసులు ఆమె ఆచూకీ కోసం అక్కడి ప్రజల సాయం కోరారు. ఈ క్రమంలోనే కరీమా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కరీమా భర్త హమ్మల్ హైదర్, సోదరుడు కూడా ఆ మృతదేహం ఆమెదేనని గుర్తించారు. ప్రస్తుతానికి కరీమా ఎలా చనిపోయిందనే విస్టరీగా మారింది. కరీమా మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఘటన వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇక, బెలూచిస్తాన్ జాతీయ ఉద్యమ నేతలు కరీమ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.

    ది బెలూచిస్తాన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (Azad)కు చెందిన కరీమా.. బెలూచిస్తాన్ ఉద్యమ నాయకురాలిగా ఆమె మంచి గుర్తింపు పొందారు. బెలూచిస్తాన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2014లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుడు జహీద్ బెలూచ్‌ను కిడ్నాప్ కావడంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. బెలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం, పాక్ ప్రభుత్వ దురాగతాలపై కరీమా బలంగా గళం వినిపించింది. మరోవైపు 2013 మార్చి 15న బెలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది.

    దీంతో కరీమా 2016లో కొద్ది మంది స్నేహితులతో కలిసి పాక్ నుంచి తప్పించుకుని కెనడాలో ఆశ్రయం పొందింది. అయితే పాక్ మిలటరీ దాడి నుంచి తాను తప్పించుకున్నానని.. ఆ తర్వాత కెనడా వెళ్లడానికి ముందు ఒక సంవత్సర కాలం పాటు భూగర్భంలోనే తలదాచుకున్నానని కరీమా పేర్కొన్నారు. ఇక, 2016లోనే కరీమాను ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతమైన, స్ఫూర్తిమంతులైన 100 మందిలో ఒకరిగా లో బీబీసీ పేర్కొంది.


    భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఆగస్టు 15న ఎర్ర కోటపై తన ప్రసంగంలో భాగంగా బెలూచిస్తాన్ అంశన్ని ప్రస్తావించడంతో.. మోదీకి కరీమా రక్షా బంధన్ సందేశం పంపారు. మోదీని సోదరుడిగా భావిస్తున్నట్టు చెప్పిన కరీమా.. బెలూచిస్తాన్ జరుగుతున్న మరణ హోమానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరారు. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
    Published by:Sumanth Kanukula
    First published: