బాల్ పాయింట్ పెన్ సూపర్ జూమ్... అదిరే వీడియో...

Ballpoint Pen Super Zoom : ఈ విశ్వం మొత్తం అణువుల మయం. మరి ఆ అణువులు ఎలా ఉంటాయో చూడాలంటే... ఈ వీడియో చూస్తే సరి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 12:17 PM IST
బాల్ పాయింట్ పెన్ సూపర్ జూమ్... అదిరే వీడియో...
బాల్ పాయింట్ పెన్ సూపర్ జూమ్... అదిరే వీడియో...
  • Share this:
మనం రాసే బాల్ పాయింట్ పెన్‌ను జూమ్ చేస్తూ పోతే ఎలా ఉంటుంది. జూమ్ అంటే... బాల్ పాయింట్‌ని జూమ్ చెయ్యడం కాదు... అంత కంటే కొన్ని వందల రెట్లు జూమ్ చేసుకుంటూ పోవడం. పెడ్రో మాచాడో అదే చేశాడు. బాల్ పాయింట్ ‌పెన్‌ను సీజీ యానిమేషన్ టెక్నిక్స్ ఉపయోగించి... జూమ్ చేస్తూపోయాడు. చివరకు క్వాంటమ్ వరల్డ్ (అణువులు) వరకూ జూమ్ చేశాడు. అందువల్ల మనకు పైకి కనిపించే బాల్ పాయింట్ పెన్... జూమ్ చేశాక ఇలా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తోంది ఆ వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోని ఇప్పుడు అందరూ చూసి... చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ క్వాంటం వరల్డ్ గురించి వినడమే తప్ప... దాన్ని మైక్రోస్కోప్‌లో ఎప్పుడూ చూడలేదంటున్న చాలా మంది... ఈ వీడియో ద్వారా దాన్ని చూశామని అంటున్నారు.First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>