భారతీయులకు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్...వీసా చార్జీలు భారీగా పెంపు...అమెరికా వెళ్లాలంటే చుక్కలే...

Bad news for Indians: అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు ఇప్పుడు ఇబి -5, యుఎస్ ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వార్త భారతీయులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

news18-telugu
Updated: February 29, 2020, 8:58 PM IST
భారతీయులకు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్...వీసా చార్జీలు భారీగా పెంపు...అమెరికా వెళ్లాలంటే చుక్కలే...
డోనాల్డ్ ట్రంప్
  • Share this:
USA VISA: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన అనంతరం వీసాలపై కొరడా ఝళిపించాడు. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు ఇప్పుడు ఇబి -5, యుఎస్ ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వార్త భారతీయులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ అదనపు చార్జీ అన్ని రకాల వీసాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ప్రధానంగా ఇబి -5 వీసా ద్వారా అమెరికాలో వ్యాపారం చేసేందుకు వచ్చే భారతీయులకు తీవ్ర అవరోధాన్ని సృష్టిస్తుందని అమెరికన్ బజార్ దినపత్రిక శుక్రవారం తెలిపింది.

2019 లో, EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ప్రకారం 1990 తరువాత మొదటిసారిగా, కనీస పెట్టుబడి మొత్తాన్ని, 9 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస పెట్టుబడిలో ఈ పెరుగుదలతో పాటు కొత్త 5 శాతం అదనపు పన్ను అంటే, దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ప్రమాణాన్ని నెరవేర్చడానికి అమెరికాలోని ఎస్క్రో ఖాతా(తాత్కాలిక పెట్టుబడి ఖాతా) కు డబ్బును తరలించినప్పుడు అదనంగా 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

"పన్ను మార్పులు భారతీయులు అమెరికాకు వెళ్ళే ముందు వారి వ్యాపారాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటానికి ఒక రిమైండర్" అని అమెరికన్ బజార్ గ్లోబల్ ఛైర్మన్ మార్క్ డేవిస్, డేవిస్ & అసోసియేట్స్ పేర్కొన్నారు.

"ఈ పన్నును చెల్లించటానికి ఇష్టపడకుండా వలస రావాలని కోరుకునే వారు కొత్త రూల్స్ అమలులోకి రాకముందే తమ డబ్బును అమెరికా తరలించి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభించే వీలుంది.ఇమ్మిగ్రేషన్ ప్రక్రియతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నంత వరకు అమెరికాలోని ఎస్క్రో ఖాతాలోకి డబ్బును ముందస్తుగా తరలించడం సాధ్యమే" అని ఆయన చెప్పారు.
Published by: Krishna Adithya
First published: February 29, 2020, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading