Home /News /international /

BACK ANYONE BUT RISHI SUNAK BORIS JOHNSON TELLS ALLIES PVN

UK PM : రిషి తప్ప ఎవరైనా ఓకే..భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని కాకుండా బోరిస్ వ్యూహం

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Boris Jhonson Serious On Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి(UK PM) రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమే లక్ష్యంగా ఆప‌ద్ధ‌ర్మ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Jhonson) పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వి కోసం రిషి సునాక్‌, పెన్నీ మార్డౌట్ మ‌రో ఐదుగురు మ‌ధ్య పోటీ సాగుతోంది.

ఇంకా చదవండి ...
    Boris Jhonson Serious On Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి(UK PM) రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమే లక్ష్యంగా ఆప‌ద్ధ‌ర్మ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Jhonson) పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వి కోసం రిషి సునాక్‌, పెన్నీ మార్డౌట్ మ‌రో ఐదుగురు మ‌ధ్య పోటీ సాగుతోంది. మ‌లి విడుత అంత‌ర్గ‌త పోలింగ్‌లోనూ రిషి సునక్(Rishi Sunak) 101 మంది ఎంపీల మ‌ద్ద‌తుతో ముందంజలో కొన‌సాగుతున్నారు. అయితే ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ మాత్రం రిషి సునక్‌ ను గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. రిషి సునక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేయాలని బోరిస్‌ జాన్సన్‌ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. రిషి తప్ప మరెవరైనా పర్వాలేదని, ఆయనకు మాత్రం మద్దతు పలకొద్దని బోరిస్ తన మద్దతుదారులకు చెబుతున్నారట. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్‌ బహిరంగంగా వెల్లడించినప్పటికీ.. రిషి సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు "ద టైమ్స్‌" కథనం పేర్కొంది.

    రిషి తనకు ద్రోహం చేశాడని, ఆయన వల్లే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యాయరని బోరిస్ ఆగ్రహంతో ఉన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని బోరిస్ జాన్సన్ తన మద్దతుదారులకు సూచించినట్టు తెలిపింది. ఆర్థిక మంత్రిగా రిషి సునక్ రాజీనామా త‌ర్వాతనే ప్ర‌ధానిగా తాను(బోరిస్‌ జాన్సన్‌) వైదొల‌గాల్సి వ‌చ్చినందునే సునక్‌పై బోరిస్‌ ఇలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రిషి సునక్ వ‌ల్లే మ‌రో మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేశార‌ని జాన్స‌న్ టీం న‌మ్మ‌కంతో ఉంద‌ని తెలుస్తోంది. ఇదంతా కొన్ని నెల‌లుగా రిషి సునాక్ చేస్తున్న కుట్ర‌ అని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ, రిషి సునాక్ టీం మాత్రం ఈ వార్త‌ల‌ను కొట్టి పారేసిన‌ట్లు సమాచారం.

    Elon Musk Father: ఇదేందయ్యా ఇది..కూతురితో శారీరక సంబంధం పెట్టుకొని బిడ్డను కన్న ఎరోల్ మస్క్



    తీవ్రమైన ఆరోపణలు రావడంతో సొంత మంత్రులే బోరిస్ జాన్సన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల ఏడో తేదీన బ్రిట‌న్ ప్ర‌ధానిగా, అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నాయ‌కుడిగా బోరిస్ జాన్స‌న్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంత క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో తాను ఎంపీల మ‌ద్ద‌తు కోల్పోవ‌డానికి రిషి సునాక్ కార‌ణం అని బోరిస్ జాన్స‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే రిషి సునక్‌ను ఓడించేందుకు బోరిస్‌ పట్టుదలతో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం ఉత్తదేనని,కానీ రిషి తనకు ద్రోహం చేశాడన్న బాధ మాత్రం బోరిస్ కు ఉందని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: Boris Johnson, Rishi Sunak, Uk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు