news18-telugu
Updated: November 16, 2020, 10:34 AM IST
పోస్ట్‌బాక్సులో కంగారూ పిల్ల... కాపాడన రెస్క్యూ టీమ్ (credit - facebook)
Australia News: దురాగతం, దుశ్చర్య, దారుణం, అరాచకం అంటుంటామే... ఇది అలాంటి ఘటనే. ఆస్ట్రేలియాలో ఓ పిల్ల కంగారూ పోస్టు బాక్సు లోపల కనిపించింది. వెంటనే దాన్ని రెస్క్యూ టీమ్ కాపాడింది. గోల్డ్‌కోస్ట్‌లోని వూంగోల్బాలో... ఎవరో గుర్తు తెలియని వ్యక్తి... బేబీ కంగారూను... పోస్టు బాక్సులోపల ఉంచి వెళ్లిపోయాడు. అతను అలా ఎందుకు చేశాడో తెలియదు. ఆ మూగ ప్రాణికి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. లోపలో ఉండి.. గింజుకుంటూ... బాధపడుతుంటే... స్థానికుల ద్వారా ఈ విషయం పింపామా ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ (FRS) టీమ్‌కి తెలిసింది. వాళ్లు ఆఘమేఘాలపై అక్కడకు వచ్చారు. వెంటనే దాన్ని బయటకు తీసి... నీరు, ఆహారం పెట్టారు. లక్కీగా ఆ మూగ జీవి ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు అది క్షేమంగా ఉన్నట్లు చెబుతూ... ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది టీమ్.
ఆస్ట్రేలియాలో కరోనాకి ముందు వచ్చిన కార్చిచ్చుతో లక్షల ప్రాణులు చనిపోయాయి. ఆ తర్వాత ఉన్న ప్రాణులను జాగ్రత్తగా కాపాడుతూ... మళ్లీ వైల్డ్ లైఫ్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కంగారూలు సాధు జంతువులు. అవి మనుషుల జోలికి రావు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు అదే. అలాంటి జీవికి ప్రాణాపాయం కలగడంతో... రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించి... హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: రోజూ వేరుశనగ కాయ కోసం ఉడుత వెయిటింగ్... వైరల్ వీడియో
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "ఆ దుర్మార్గుడు ఎవడు... అలా చెయ్యడానికి మనసెలా వచ్చింది" అని ఫైర్ అవుతున్నారు. ఓ యూజరైతే... ఈ భూమిపై అత్యంత దుర్మార్గపు జీవి మనిషే అని కామెంట్ రాశారు. "వాడెవడో హృదయం లేని క్రూరుడు" అని మరో యూజర్ తిట్టిపోశారు.

కంగారూ ఘటనపై నెటిజన్ల కామెంట్లు
ఇలాంటి కామెంట్లు... వన్య ప్రాణుల రక్షణ బృందానికి సపోర్టుగా నిలుస్తున్నాయి. తాము మరింత ఉత్సాహంతో పనిచేయడానికి మీ మద్దతు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని రెస్క్యూ టీమ్ తెలిపింది.
Published by:
Krishna Kumar N
First published:
November 16, 2020, 10:34 AM IST