షాకింగ్.. చర్మమే లేకుండా పుట్టిన బిడ్డ.. కాపాడేందుకు డాక్టర్ల కృషి..

వాషింగ్టన్‌లో ఓ చిన్నారి చర్మం లేకుండానే జన్మించాడు. తల, కాళ్లపై ప్రాంతంలోనే చర్మం ఉండి.. మెడ, ఛాతి, వీపు, చేతులు, పాదాలపై చర్మం లేకుండానే పుట్టాడు. చిన్నారికి పరీక్షలు జరిపిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాణాలు నిలిపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: April 21, 2019, 6:08 PM IST
షాకింగ్.. చర్మమే లేకుండా పుట్టిన బిడ్డ.. కాపాడేందుకు డాక్టర్ల కృషి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 21, 2019, 6:08 PM IST
మానవశరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఆ చర్మానికి ఏ చిన్న గాయమైనా అస్సలు తట్టుకోలేం. ఓ రకంగా చెప్పాలంటే బాడీలోని అన్ని అవయవాలకు చర్మమే రక్షణ.. మరీ అలాంటి చర్మమే లేకుండా జననం కష్టమే కదా.. కానీ, అలాంటి వింత జననమే వాషింగ్టన్‌లో జరిగింది. శాన్ ఆంటోనియాకు చెందిన ప్రిస్కిల్లా మల్డొనాడో టెక్సాస్‌లోని మెథడిస్ట్ ఆస్పత్రిలో ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తొలికాన్పులోనే కొడుకు పుట్టాడు. దీంతో ఆనందపడ్డారు.. కానీ... పుట్టిన బిడ్డకు చర్మమే లేకుండా పుట్టాడు. ఆ చిన్నారికి జబారి అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు.

ఆటో ఇమ్యూన్ లోపం కారణంగా ఒంటిపై చర్మం లేకుండా పుట్టాడు జబారి. ఇలాంటి జననాలు మరీ తక్కువ. జబారి పుట్టినప్పుడు తల, కాళ్లపై కొంత ప్రాంతంలోనే చర్మం ఉంది. మెడ, ఛాతి, వీపు, చేతులు పాదాలపై అసలు చర్మమే లేదని వైద్యులు తెలిపారు. ఇలాంటి పిల్లలు బతికే అవకాశమే లేదు.. కానీ, మల్డొనాడో దంపతులు బిడ్డను ఎలాగైనా బిడ్డను బతికించుకోవాలని జబారిని మరో ఆస్పత్రికి తరలించారు.

ఇప్పటికే ఓ శస్త్రచికిత్స నిర్వహించి శ్వాసకోశ ఇబ్బందుల్లేకుండా చేశారు వైద్యులు. ల్యాబ్‌లో చర్మాన్ని అభివృద్ధి చేసి కొన్ని శస్త్రచికిత్సల తర్వాత జబరికి అమర్చనున్నట్లు వైద్యులు తెలిపారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...