వామ్మో... డ్రైవర్ లెస్ బస్సులు... ప్రయాణికులకు షాకులు...

Automated Buses : డ్రైవర్లు లేని రైళ్లను, కార్లనూ చూస్తున్నాం. అదే విధంగా డ్రైవర్లు లేని బస్సుల్ని తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందుండగా... సింగపూర్ సెకండ్ పొజిషన్‌లో ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 11:50 AM IST
వామ్మో... డ్రైవర్ లెస్ బస్సులు... ప్రయాణికులకు షాకులు...
డ్రైవర్ లెస్ బస్ (Image : Twitter - Reuters)
  • Share this:
Driver Less Buses : అది సింగపూర్‌లోని రద్దీలేని రోడ్డు. ఆ రోడ్డుపై ట్రయల్ వెర్షన్ కింద... డ్రైవర్ లేని బస్సుల్ని నడపాలని సింగపూర్ పాలకులు నిర్ణయించారు. అనుకున్నట్లే వారం పాటూ ట్రయల్ బస్సులు నడిచాయి. ఐతే... అనుకున్నదొకటి... అయ్యిందొకటి... ఆ బస్సులకు ముందుగానే ఇలా వెళ్లాలి... ఇలా ఆగాలి... అనే సాఫ్ట్‌వేర్ సెన్సార్ రూల్స్ ఉంటాయి కాబట్టి... ఆ బస్సులు ఆ రూల్స్ ప్రకారమే వెళ్లాయి. దారిలో ఓ చోట తుప్ప మొక్కలు... రోడ్డుపై దాకా పెరిగాయి. ఈ బస్సులు... ఆ మొక్కలు ఉన్న చోటల్లా సెన్సార్ల సిగ్నల్స్‌తో ఆగిపోసాగాయి. ఆ మొక్కల్ని అధికారులు తొలగించాకే ముందుకు వెళ్లాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు... సడెన్‌గా రోడ్డు దాటేస్తుంటే... ఈ బస్సులు సడెన్ బ్రేకులు వేసుకుంటూ... ప్రయాణిస్తున్నవారికి చుక్కలు చూపించాయి. కొన్ని చోట్ల రోడ్డుపై నెమళ్లు అడ్డుగా రాగానే... ఈ బస్సులు... వాటిని దాదాపు గుద్దేసేంత పనిచేశాయి. ఇలా ట్రయల్ వెర్షన్‌లో బస్సులు చుక్కలు చూపిస్తున్నాయి.

డ్రైవర్ లెస్ బస్ (Image : Twitter - James Sivalingam)


తీరప్రాంత జిల్లా సెంటోసాలో మొత్తం నాలుగు డ్రైవర్ లెస్ బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో డ్రైవర్ లెస్ బస్సుల్ని అమెరికా ముందుగా తేవాలనుకుంటోంది. ఆ వెంటనే సింగపూర్... 2022 నుంచీ మూడు జిల్లాల్లో ఇలాంటి బస్సుల్ని నడపాలనుకుంటోంది. అందుకోసం నవంబర్ 15 వరకూ ట్రయల్ బస్సులు నడపబోతున్నారు. అవి ఎలా నడుస్తున్నాయో, సింగపూర్ అధికారులతోపాటూ... ప్రపంచ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.

ప్రస్తుతం ఈ బస్సుల్లో డ్రైవర్లు ఉంటున్నారు. పొరపాటున బస్సు ఏదైనా ప్రమాదం చేసే పరిస్థితి వస్తే, వెంటనే ఆపేందుకు డ్రైవర్లు... డ్రైవింగ్ సీట్లలో కూర్చుంటున్నారు. ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్న నెమళ్ల వల్ల బస్సులకు చాలా ఇబ్బంది కలుగుతోందని వాళ్లు చెబుతున్నారు. 2016లో ఇలాగే... ఇదే సింగపూర్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును టెస్ట్ చేశారు. అది రోడ్డు మారుతూ... ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఎవరూ గాయపడలేదుగానీ... అమెరికాలో జరిగిన ఇలాంటి ప్రయోగాల్లో తీవ్రమైన ప్రమాదాలు జరిగాయి. అలాగని టెక్నాలజీని మనం వద్దని అనలేం. టెక్నాలజీ వల్లే మనం ఈ రోజున ఇంత డెవలప్‌మెంట్ పొందగలిగాం. కాబట్టి... భవిష్యత్తులో డ్రైవర్ లెస్ కార్లు, బస్సుల్ని చూస్తామంటున్నారు సింగపూర్ ప్రజలు.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు