Home /News /international /

AUTOCRACIES WILL RUN THE WORLD CHINA XI JINPING TOLD US PRESIDENT BIDEN PVN

Joe Biden : జిన్ పింగ్ బైడెన్ తో అలా అన్నారంట..ఏమన్నాడో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

అమెరికా అధ్యక్షుడు బైడెన్ (ఫైల్)

అమెరికా అధ్యక్షుడు బైడెన్ (ఫైల్)

Xi Jinping told US President Biden : అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు చైనా(China)అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)తో జరిగిన ఓ ఫోన్ కాల్ సంభాషణ గురించి బైడెన్(Joe Biden)తాజాగా వివరించారు. ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో తనతో ఆ రోజు అన్నారని బైడెన్ తెలిపారు.

ఇంకా చదవండి ...
Autocracies will run the world : అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు చైనా(China)అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)తో జరిగిన ఓ ఫోన్ కాల్ సంభాషణ గురించి బైడెన్(Joe Biden)తాజాగా వివరించారు. ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో తనతో ఆ రోజు అన్నారని బైడెన్ తెలిపారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో పాల్గొన్న బైడెన్‌..జిన్ పింగ్ కు తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను బయటపెట్టారు. బైడెన్ మాట్లాడుతూ..." నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాల మధ్య పోరాట ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇతర ప్రపంచ నాయకులతో పోల్చితే నేను జిన్‌పింగ్‌‌తో ఎక్కువసార్లు భేటీ అయ్యా. ఎన్నికల రాత్రి నన్ను అభినందించేందుకు ఆయన ఫోన్ చేసి గతంలో చాలాసార్లు చెప్పిన మాటే చెప్పారు. 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యాలు మనుగడ సాధించలేవు. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఎందుకంటే.. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యాల్లో ఏకాభిప్రాయం అవసరం. దానికి సమయం పడుతుంది. మీకు ఆ సమయం లేదు"అని జిన్ పింగ్ తనతో అన్నారని బైడెన్ గుర్తుచేశారు.

ఈ విషయంలో జిన్‌పింగ్‌ది తప్పుడు అభిప్రాయమని పేర్కొన్నారు. కాగా, కొంతకాలంగా చైనా, అమెరికాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే సాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఇటీవల జపాన్ పర్యటనలో జో బైడెన్..తైవాన్(Taiwan)విషయంలో నేరుగా చైనాను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత స్వయంపాలిత ద్వీపమైన తైవాన్‌ భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు జో బైడెన్ తెలిపారు. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా(China)బలగాలను ఉపయోగించే ప్రయత్నం మంచిది కాదన్నారు. చైనా అలాంటి చర్యలకు దిగితే ఆ ప్రాంతంలో అస్థిరత తలెత్తుతుందని అన్నారు. ఉక్రెయిన్‌ తరహా చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. వన్‌ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉందన్న బైడెన్.. అలాగని తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చూస్తే సైనికపరంగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక ప్రమాదంతో ఆటలాడుతోందని చైనాను హెచ్చరించారు.

ALSO READ China-Taiwan : టెన్షన్..టెన్షన్..తైవాన్ గగనతలంలోకి 30 యుద్ధ విమానాలు పంపిన చైనా

తైవాన్‌ మొదటి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అమెరికా సైతం తైవాన్‌కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. అయినప్పటికీ చైనా దండెత్తితే సైనికపరమైన జోక్యం చేసుకుంటామని అమెరికా ప్రకటించడం ఇదే తొలిసారి. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తైవాన్‌ సమీపంలోకి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలను పంపుతూ చైనా భయాందోళనలు కలిగిస్తోంది. ఈ క్రమంలో తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సాయం చేస్తుందా అనే ప్రశ్నపై బైడెన్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Joe Biden, US-China, Xi Jinping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు