హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Omicron variant: ఆ దేశానికి కూడా పాకిన కరోనా కొత్త వేరియంట్​.. ఇద్దరికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు గుర్తింపు

Omicron variant: ఆ దేశానికి కూడా పాకిన కరోనా కొత్త వేరియంట్​.. ఇద్దరికి ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు గుర్తింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్​ చేరింది.

ఇంకా చదవండి ...

కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్​ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్​డౌన్​లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave)​ చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్​ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్​ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్​ కూడా తలుపుతడుతోంది. రష్యా (Russia) కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు (corona cases) భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు వెయ్యికి మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. అయితే  దక్షిణాఫ్రికా (South africa)లో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron variant).. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ (Britain)​ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం..

కొత్త వేరియంట్ (new variant)​ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని వెల్లడించారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించి ఆ ఇద్దరికీ మరిన్ని పరీక్షలు (tests) నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్​లో ఉన్నారని పేర్కొన్నారు.

ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమావేశం..

ముందుజాగ్రత్త చర్యగా.. కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆ దేశ హెల్త్​ సెక్రెటరీ సాజీద్​ జావెద్​ తెలిపారు. ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని (people health) దృష్టిలో ఉంచుకొని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఇజ్రాయెల్‌లో 4  కేసులు..

దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. కానీ గత ఐదు రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఐతే కొత్త వేరియెంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్‌లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

First published:

Tags: Britain, Corona alert, Corona cases, South Africa

ఉత్తమ కథలు