• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • AUSTRIALA REFUSED FOR PASSENGERS TRAVEL IN AIR INDIA FLIGHT FROM SYDNEY TO NEW DELHI AFTER ONE OF THE CREW TESTED COVID 19 POSITIVE AK

ఆస్ట్రేలియా నుంచి ఢిల్లీకి ఖాళీగా వచ్చిన విమానం.. అసలు కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

పలువురు ప్రయాణికులతో ఢిల్లీ నుంచి సిడ్నీకి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి వెళ్లింది. విమానం బయలుదేరడానికి ముందే అందులో ప్రయాణించే సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో అందరికీ నెగిటివ్ వచ్చింది.

  • Share this:
    దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో.. ఇండియా నుంచి వస్తున్న విమానాల్లోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో పలు దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి సిడ్నీ నుంచి వెళ్లిన విమానంలోని సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఆ విమానంలో ప్రయాణికులను పంపించేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించారు. దీంతో ఆ విమానం కేవలం కార్గో, సిబ్బందితో ఢిల్లీకి చేరుకుంది. నిజానికి శనివారం పలువురు ప్రయాణికులతో ఢిల్లీ నుంచి సిడ్నీకి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి వెళ్లింది. విమానం బయలుదేరడానికి ముందే అందులో ప్రయాణించే సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో అందరికీ నెగిటివ్ వచ్చింది.

    అయితే ఆస్ట్రేలియా చేరుకున్న తరువాత సిబ్బందికి అక్కడ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు సోమవారం వచ్చాయి. అందులో ఒకరికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ విమానం మళ్లీ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమతించలేదు. అంతేకాదు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అక్కడే ఐసొలేషన్‌లో ఉంచారు. మరోవైపు ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విమాన రాకపోకలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15 వరకు నిషేధం విధించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: