కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్డౌన్లను విధించాయి. కరోనా రెండో వేవ్ చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్ కూడా తలుపుతడుతోంది. ఇదే కోవలో యూరప్ లో కొత్త వేవ్ కారణంగా కరోనా కేసుల (Corona Cases) సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ (Lockdown) విధించాలని యూరప్ (EU)లోని ఆస్ట్రియా దేశం (Austria) నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ (Chancellor Alexander Shalen berg ) శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.
10 రోజులపాటు లాక్డౌన్..
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టకపోతే మరో 10 రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని స్పష్టం చేశారు ఛాన్సలర్. పాఠశాలలు, రెస్టారెంట్లను మూసివేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను (Austria Lockdown) రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ప్రకటనతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన తొలి ఐరోపా దేశంగా ఆస్ట్రియా నిలిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ (Vaccination) తప్పనిసరి చేస్తామని వెల్లడించారు.
రోజుకు 10 వేలకు పైగా కేసులు..
ప్రస్తుతం ఆ దేశంలో టీకా వేయించుకోని వారిపై మాత్రమే లాక్డౌన్ (Lockdown) అమలులో ఉంది. సుమారు 90 లక్షల మంది జనాభా ఉన్న ఆస్ట్రియాలో 65.7 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి టీకా తీసుకోని వారు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గత ఏడు రోజులుగా ఆస్ట్రియాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు రష్యాను కరోనా మహమ్మారి మళ్లీ గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నా యి. వరుసగా నాలుగో రోజూ కొవిడ్ మృ తుల సం ఖ్య 1200లకు పైగా నమోదైంది. దేశం లో బుధవారం 1247 మం ది కొవిడ్‌తో మృ త్యు వాత పడగా.. గురువారం 1251, శుక్రవారం 1254 మం ది చొప్పున మరణిం చారు. అలాగే, శనివారం కూడా 1254మం ది కరోనా కాటుకు బలికాగా.. 37,120మం దికి ఈ మహమ్మా రి సోకినట్టు రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడిం చారు. గత కొన్ని వారాలుగా కొవిడ్ ఉద్ధృ తి తగ్గినట్టు కనబడినప్ప టికీ.. గతం లో కన్నా అధికం గా కేసులు, మరణాలు నమోదుకావడం గమనార్హం .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.