Home /News /international /

Covaxin టీకాకు Australia గుర్తింపు -ఆ ప్రయాణికులకు గ్రీన్‌సిగ్నల్ -600రోజుల తర్వాత అంతర్జాతీయ విమానాలు

Covaxin టీకాకు Australia గుర్తింపు -ఆ ప్రయాణికులకు గ్రీన్‌సిగ్నల్ -600రోజుల తర్వాత అంతర్జాతీయ విమానాలు

కొవాగ్జిన్ కు ఆసీస్ గుర్తింపు

కొవాగ్జిన్ కు ఆసీస్ గుర్తింపు

భారత ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాకు సంబంధించి మరో పాజిటివ్ న్యూస్ వచ్చింది. కొవాగ్జిన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించకున్నా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు వెనుకాడుతున్నా.. ఆ టీకా తీసుకున్నవాళ్లు తమ దేశంలోకి రావొచ్చంటూ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నలిచ్చింది. దాదాపు 600 రోజుల తర్వాత ఆసీస్ లో అంతర్జాతీయ విమానసర్వీసులు మళ్లీ మొదలయ్యాయి..

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాకు మరో దేశం గుర్తింపునిచ్చింది. కొవాగ్జిన్ టీకాకు ఇప్పటిదాకా ప్రంపచ ఆరోగ్య సంస్థ అధికారిక అనుమతి ఇవ్వకున్నా, అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు సైతం వెనుకాడుతున్నా, అంతర్జాతీయ ప్రయాణాల దృష్ట్యా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ టీకాదారులు తమ దేశంలోకి రావొచ్చని గ్రీన్ సిగ్నలిచ్చింది. దాదాపు 600 రోజుల తర్వాత ఆస్ట్రేలియా అంతర్జాతీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది..

భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ రూపొందిచిన కొవాగ్జిన్ టీకా వేసుకున్న వాళ్లు త‌మ దేశానికి రావొచ్చంటూ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు మళ్లీ మొదలైన నేపథ్యంలో ప్ర‌యాణికుల వ్యాక్సినేష‌న్ స్టాట‌స్ విష‌యంలో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తున‌ట్లు ఆస్ట్రేలియా హై క‌మిషన‌ర్ బారీ ఓ ఫారెల్ ఏవో తెలిపారు. కొవాగ్జిన్ తోపాటు చైనా తయారీ సైనోఫార్మ్ టీకాకు కూడా ఆసీస్ అనుమతిచ్చింది. ఆస్ట్రాజెనికా, మోడెర్నా.. మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న‌వారికి కూడా దేశంలోకి ప్రవేశం ఉంటుందని ఆసీస్ అధికారులు పేర్కొన్నారు.

కొవాగ్జిన్ సమర్థతపై విదేశాల్లో తొలి నుంచీ అనమానాలు కొనాసగుతుండటం, భారత్ లోనే తయారైన కొవిషీల్డ్(ఆస్ట్రాజెనెకా, సీరం తయారీ)కు మాత్రం అనుమతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను పక్కన పెట్టడం వివాదాస్పదమైంది. కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారు అమెరికా, బ్రిటన్ దేశాలకు వెళ్లలేని పరిస్థితిలో కొన్ని దేశాలు ఆ టీకాకు గుర్తిపునివ్వడం గమనార్హం.

ఇప్పటిదాకా కొవాగ్జిన్ కు గుర్తింపునిచ్చిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియాతోపాటు మారిషస్, ఒమన్, ఫిలిప్పీన్స్, నేపాల్, మెక్సికో, ఇరాన్, శ్రీలంక, గ్రీస్, ఎస్టోనియా, జింబాబ్వే తదితర దేశాలున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన పిల్లల టీకాలకు కూడా భారత ప్రభుత్వం అనుమతివ్వగా, ప్రపంచ ఆరోగ్య సంస్థమాత్రం ఇప్పటిదాకా పెద్దల టీకాలకూ గుర్తింపు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Australia, Bharat Biotech, Covaxin

తదుపరి వార్తలు