Home /News /international /

AUSTRALIA QUEENSLAND 70 KG BANANAS FELL ON FARM WORKER OWNER PAYS RS 4 CRORE COMPENSATION SU

కూలీ తలపై పడిన అరటిపండ్లు.. రూ. 4 కోట్ల పరిహారం చెల్లించమని చెప్పిన కోర్టు!.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తోటలో పనిచేస్తుండగా తలపై అరటిపండ్ల గుత్తి పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు తోట యజమానిపై కోర్టులో దావా వేశాడు. చివరకు అతడికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

    కొన్ని వార్తలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేస్తుంది. తాజాగా అలాంటి ఓ వార్తనే మీకు అందిస్తున్నాం. ఓ తోటలో పనిచేస్తున్న కూలీపైన అరటిపండ్ల గుత్తి గాయపడగా.. అతని పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఆ కూలీకి రూ. 4 కోట్ల పరిహారం చెల్లించాలని తోట యజమానిని ఆదేశించింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు.. లాంగ్‌బాటమ్ అనే వ్యక్తి కుక్‌టౌన్ సమీపంలో ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో పనిచేస్తున్నాడు. 2016లో అతడు తోటలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అరటి కోత సమయంలో అతడు గాయపడ్డాడు.

    అక్కడే పనిచేస్తున్న తోటి ఉద్యోగి పెద్ద కోత పెట్టడంతో చెట్టు కూలిపోయింది. అది కాస్తా లాంగ్‌బాటమ్‌పై పడిపోయింది. దీంతో అతడు కుడివైపు భుజంపై పడిపోయాడు. ఆ తర్వాత అతని కుక్‌టౌన్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత అతడు వ్యవసాయ పనులకు తిరిగి రాలేదు. ఆ ప్రమాదం జరిగినప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. ఈ ప్రమాదం అతడి కుడి భుజంపై తీవ్రమైన ప్రభావం చూపడంతో.. అతడు మానసికంగా గాయపడ్డాడు. శ్రమతో కూడిన పనిచేయడానికి వీలు లేకుండా పోయింది.

    Film director: సినీ దర్శకుడిపై మహిళ ఫిర్యాదు.. హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్ ఉందని చెప్పి..

    ఈ క్రమంలోనే అతడు కోర్టును ఆశ్రయించాడు. తనకు 500, 000 డాలర్ల పరిహారం చెల్లించాలని కోరాడు. ఇందుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అతని పడిన అరటిపండ్లు 70 కిలోల వరకు బరువు ఉంటాయని అంచనా వేశారు.

    Teacher - Student: ఫీలింగ్స్ చెప్పాలని బాలుడికి మెసేజ్.. కారులోనే పలుమార్లు లైంగిక దాడి.. బాలుడి సోదరికి..

    న్యాయమూర్తి కూడా లాంగ్‌బాటమ్ తరఫు వాదనలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన తీర్పు ఇటీవల వెలువడింది.  తన తీర్పులో చీఫ్ జస్టిస్ హోమ్స్ మాట్లాడుతూ.. లాంగ్‌బాటమ్‌ ఎదుర్కొన్న సంఘటన నిజమైనదేనని నమ్మడం జరుగుతుంది. లాంగ్‌బాటమ్ జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఈ కారణంగానే.. కార్మికుడికి 502,740 డాలర్ల పరిహారాన్ని(రూ. 3,77,15,630) రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించారు. తోటలో పనిచేస్తున్న కార్మికులకు సరైన శిక్షణ కల్పించకపోవడం వంటి అంశాలను కూడా కోర్టు ప్రస్తావించింది. తోట యాజమాన్యం చాలా అజాగ్రత్తగా వ్యవహరించిందంటూ న్యాయస్థానం మందలించింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Australia, Banana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు