సమోసాలు, మామిడి చట్నీ చేసిన ఆసీస్ ప్రధాని... మోదీ రియాక్షన్..

‘సండే సమోసా, మ్యాంగో చట్నీ. అన్నీ చేశా. ఈ వారం నేను భారత ప్రధాని మోదీతో వీడియో లింక్‌లో మీటింగ్ కాబోతున్నా.’ అని స్కాట్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: May 31, 2020, 4:28 PM IST
సమోసాలు, మామిడి చట్నీ చేసిన ఆసీస్ ప్రధాని... మోదీ రియాక్షన్..
సమోసా తయారు చేసిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ (Image;Scott Marrison /Twitter)
  • Share this:
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇండియన్ స్టైల్లో సమోసా, మామిడికాయ పచ్చడి చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో పంచుకోవడానికి ఆయన తాను చేసిన వంటకాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘సండే సమోసా, మ్యాంగో చట్నీ. అన్నీ చేశా. ఈ వారం నేను భారత ప్రధాని మోదీతో వీడియో లింక్‌లో మీటింగ్ కాబోతున్నా. ఆయన వెజిటేరియన్. ఈ సమోసాను నేను ఆయనతో పంచుకోవాలనుకుంటున్నా.’ అంటూ ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు. ప్లేట్లో నోరూరించే సమోసాలు పట్టుకుని, ఆ ఫొటోలను షేర్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చేసిన సమోసా ట్వీట్‌కు భారత ప్రధాని మోదీ స్పందించారు. బాగా నోరూరించేలా ఉన్నట్టున్నాయంటూ అభినందించారు. ‘హిందూ మహాసముద్రం కలిపింది. ఇండియన్ సమోసా ఏకం చేసింది. సమోసాలు నోరూరిస్తున్నాయ్. కరోనా మీద మనం విజయం సాధించిన తర్వాత కచ్చితంగా సమోసాతో పార్టీ చేసుకుందాం. 4వ తేదీన వీడియో భేటీ కోసం ఎదురుచూస్తున్నా.’ అంటూ ప్రధాని మోదీ రీ ట్వీట్ చేశారు.
First published: May 31, 2020, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading