Coronavirus: ఆస్ట్రేలియాలో కరోనా వ్యాధిపై తొలి విజయం సాధించిన సైంటిస్టులు

కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని వణికిస్తుంటే దాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా సైంటిస్టులు నడుంకట్టారు. తొలిసారిగా వారు చైనా వెలుపల కరోనా(Coronavirus) వైరస్‌ను రీ క్రియేట్ చేశారు. అయితే ఇదొక ఘనవిజయమని వారు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: January 29, 2020, 11:01 PM IST
Coronavirus: ఆస్ట్రేలియాలో కరోనా వ్యాధిపై తొలి విజయం సాధించిన సైంటిస్టులు
Coronavirus : కరోనా వైరస్‌పై వస్తున్న టాప్ 10 వింత వదంతులు ఇవే...
  • Share this:
Coronavirus: కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని వణికిస్తుంటే దాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా సైంటిస్టులు నడుంకట్టారు. తొలిసారిగా వారు చైనా వెలుపల కరోనా(Coronavirus) వైరస్‌ను రీ క్రియేట్ చేశారు. అయితే ఇదొక ఘనవిజయమని వారు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో వీరు కలిసి తమ పరిశోధనలను పంచుకోనున్నట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాధిని గుర్తించేందుకు దీన్ని రూపొందిస్తున్నామని అంటువ్యాధులపై పరిశోధన సాగిస్తున్న డాక్టర్ మైక్ కాటన్ తెలిపారు. చైనా వెలుపల ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి కావడం విశేషం. మెల్బోర్న్ యూనివర్శిటీ, రాయల్ మెల్బోర్న్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం. నూతన కరోనా వైరస్ జినోమ్ సీక్వెన్స్‌ను చైనా అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. వ్యాధిని గుర్తించడానికి అది తోడ్పడుతుంది. అయితే అసలైన వైరస్ ద్వారా దాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు, తీవ్రతను గుర్తించేందుకు అన్ని పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ ప్రయోగం ద్వారా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.(Coronavirus)

ఇదిలా ఉంటే అన్ని దేశాలు తమ పౌరులు కరోనా(Coronavirus) బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా(Coronavirus) వైరస్ బాధితులను ఉంచేందుకు ప్రత్యేకమైన ప్రదేశాన్ని సిద్ధం చేయాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. వైరస్ తీవ్రత తగ్గేంత వరకూ దేశ ప్రధాన భూభాగానికి దూరంగా ఎక్కడైనా దూరంగా వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించాలని యోచిస్తున్నాయి. ఆస్ట్ర్రేలియా కరోనా బాధితుల కోసం తమ సమీపంలో క్రిస్మస్ ద్వీపాన్ని ఎంచుకుంది. ఇందులోకరోనా బాధితులకు ఆశ్రయం కల్పించనుంది.

ఈ ద్వీపం ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 2వేల కిలోమీటర్లు దూరంలో ఉంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి తిరిగి వచ్చే 600 మంది ఆస్ట్రేలియన్లను క్రిస్మస్ ద్వీపంలో నిర్బంధించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తోంది. ఆస్ట్రేలియా బాటలో ఇతర దేశాలు సైతం తమ పౌరులను స్వదేశానికి రప్పించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే ప్రపంచదేశాలను కరోనా(Coronavirus) వైరస్ వణికిస్తోంది. చైనా నుంచి అమెరికా వరకు వ్యాపించిన ఈ వైరస్‌ అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సమావేశమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా చైనా దేశానికి రాకపోకలను నిషేధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. చైనా, థాయిలాండ్‌, జపాన్‌, అమెరికా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించింది. వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించింది. భారత్‌ లోని పలు విమానాశ్రయాల్లో 9,156 మంది ప్రయాణికులను పరీక్షించగా కరోనా వైరస్ కేసులు బయటపడలేదని వైద్యాధికారులు చెప్పారు.
Published by: Krishna Adithya
First published: January 29, 2020, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading