హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China Cyber Attack: లద్ధాఖ్‌ సమీపంలోని చైనా సైబర్ దాడి యత్నం.. దీనిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

China Cyber Attack: లద్ధాఖ్‌ సమీపంలోని చైనా సైబర్ దాడి యత్నం.. దీనిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా ప్రభుత్వం (China) తరఫున పని చేస్తున్న హ్యాకర్లు (Hackers) ఎనిమిది నెలలుగా లద్ధాఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను (electricity distribution centres) హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదికలు గుర్తించాయి.

చైనా ప్రభుత్వం (China) తరఫున పని చేస్తున్న హ్యాకర్లు (Hackers) ఎనిమిది నెలలుగా లద్ధాఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను (electricity distribution centers) హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదికలు గుర్తించాయి. బుధవారం ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్‌ ఫ్యూచర్ ఈ వివరాలను వెల్లడించింది. లద్ధాఖ్‌ (Ladakh) ప్రాంతంలో రెండు దేశాల మధ్య సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభన తరువాత ఈ తరహా చర్యలకు చైనా పాల్పడుతోందని, కానీ హ్యాకర్ల దాడులు విజయవంతం కాలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. రికార్డెడ్‌ ఫ్యూచర్‌ విడుదల చేసిన ప్రకటనలో.. ‘ఇటీవల కాలంలో ఈ రాష్ట్రాలలో గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపకం కోసం రియల్‌ టైమ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDC) లక్ష్యంగా చేసుకుని నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు హ్యాకర్లు యత్నించినట్లు గుర్తించాం.

చొరబాట్లకు యత్నించిన SLDCలు ఉత్తర భారతదేశం లద్ధాఖ్‌లోని వివాదాస్పద భారతదేశం, చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌, మల్టినేషనల్‌ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థ భద్రతకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించాం. గత ఏడాది ఫిబ్రవరిలో 10 విభిన్న భారతీయ విద్యుత్ రంగ సంస్థలను ముప్పుపై హెచ్చరించాం. ఇందులో మొత్తం ఉన్న ఐదింటిలో నాలుగు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు (RLDC), రెండు పోర్ట్‌లు, లార్జ్‌ జనరేన్‌ ఆపరేటర్, ఇతర కార్యాచరణ ఆస్తులు ఉన్నాయి.’ అని తెలిపింది.

గత ఏడాది ఆగస్టు నుంచి మార్చి మధ్య కాలంలో ఈ దాడులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న చైనా ప్రభుత్వానికి సంబంధం ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌లకు భారతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్‌ల నుంచి డేటా సరఫరా అయినట్లు తెలిపారు. నివేదికను ప్రచురించే ముందు తమ పరిశోధనల గురించి భారత ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు రికార్డెడ్‌ ఫ్యూచర్‌ పరిశోధన బృందం తెలిపింది.

StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

ఈ విషయంపై కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘లద్దాఖ్ సమీపంలోని విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా హ్యాకర్లు చేసిన రెండు ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఇటువంటి సైబర్ దాడులను ఎదుర్కోవడానికి మేము ఇప్పటికే మా రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాం.’ అని చెప్పారు.

క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వివరాలను సేకరించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్‌ ఫ్యూచర్‌ చెబుతోంది. గత 18 నెలలుగా భారతదేశంలోని రాష్ట్ర, ప్రాంతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, తొలుత RedEcho, ఇప్పుడు తాజాగా TAG-38 కార్యకలాపాలతో ఈ విషయం స్పష్టమైందని తెలిపింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు దీర్ఘకాలిక వ్యూహంతోనే పని చేస్తున్నారని పేర్కొంది. భవిష్యత్తు అవసరాల కోసం కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో ఆకస్మిక కార్యకలాపాలకు సన్నాహకంగా సిస్టమ్ యాక్సస్‌ పొందడం చైనా హ్యాకర్ల లక్ష్యమని భావిస్తున్నట్లు వెల్లడించింది.

Published by:Veera Babu
First published:

Tags: China, Cyber Attack, Jammu and Kashmir, Ladakh

ఉత్తమ కథలు