హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Atacama Desert : చెత్తకుప్పలా అటకామా ఎడారి.. పర్యావరణ వేత్తల ఆందోళన

Atacama Desert : చెత్తకుప్పలా అటకామా ఎడారి.. పర్యావరణ వేత్తల ఆందోళన

చెత్తకుప్పలా అటకామా ఎడారి (image credit - twitter - @AFPphoto)

చెత్తకుప్పలా అటకామా ఎడారి (image credit - twitter - @AFPphoto)

Atacama Desert : చిలీలోని అటకామా ఎడారికి ఈ గతి పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు ప్రపంచ చెత్తంతా అక్కడ ఎందుకు పారేస్తున్నారు? ఎడారిని ఎందుకు నాశనం చేస్తున్నారు? తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ భూమిని అత్యంత ఎక్కువగా కాలుష్యం చేస్తున్నది మనిషే. ఆల్రెడీ నదులు, సముద్రాల్లో రోజూ వేల టన్నుల చెత్తను పారేస్తున్నారు. తాజాగా దక్షిణ అమెరికా దేశం.. చిలీలోని అటకామా ఎడారి (Atacama Desert)ని సర్వనాశనం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలో అత్యంత పొడి వాతావరణం ఉండే ప్రదేశం అటకామా. అక్కడ ఎండ ఎక్కువ. మనుషులు బతకడం చాలా కష్టం. కాకపోతే.. ఆ ఎడారిలోనూ ఎన్నో జీవులు బతుకుతున్నాయి. అలాంటి చోట.. టన్నుల కొద్దీ చెత్తను పారేస్తున్నారు. ఎడారి కాస్తా చెత్తకుప్పలా మారిపోయింది.

పాత కార్లు, పాత టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఇలా పనికిరాని అన్నింటినీ తీసుకెళ్లి... ఎడారిలో పడేస్తున్నారు. అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాసా.. అటకామా ఎడారిలో చాలా టెలిస్కోప్‌లను ఏర్పాటు చేసింది. ఆ ఎడారిలోపలి భూమిలో రాగి, లిథియం ఉన్నాయి. అలాంటి విలువైన ఎడారిని నాశనం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.

చిలీలో ఏళ్లుగా ఓ సంప్రదాయం ఉంది. అమెరికా, ఆసియా, యూరప్‌లో పాతవైపోయిన బట్టలను చిలీలో అమ్ముతారు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న బట్టలు అమ్ముడవ్వకపోతే.. వాటిని అటకామా ఎడారిలో పడేస్తున్నారు. ఈ బట్టల తయారీలో రకరకాల కెమికల్స్ వాడుతారు. ఇవి భూమిలో కలిసిపోవడానికి 200 ఏళ్లు పడుతుంది. ఇవి భూమినీ, మట్టినీ, భూగర్భ జలాలనీ కలుషితం చెయ్యగలవు.

ఈ చెత్తకు సంబంధించిన వీడియోలూ, ఫొటోలూ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. చాలా మంది పర్యావరణ వేత్తలు వీటిని చూసి.. అయ్యో అని బాధపడుతున్నారు. పర్యావరణంపై సదస్సులు పెట్టుకునే ప్రపంచ దేశాల అధినేతలకు.. అటకామా దారుణం కనిపించట్లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

అటకామా ఎడారి ఈ భూమికే ప్రత్యేకమైనది. అది లక్ష చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. అది 80 లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడిన ఎడారి. అక్కడ వర్షం అత్యంత అరుదుగా పడుతుంది. అలాంటి ఎడారిలోని ఓ చోట.. మనుషులు జీవించలేని ప్రదేశంలో.. ప్రత్యేక సూక్ష్మజీవులు జీవించగలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఎలా జీవిస్తున్నాయో వారికే అర్థం కాలేదు. ఇలాంటి పరిశోధనలకు ఆ ఎడారి కీలకమైనది.

Memes : దుమ్మురేపే నవ్వుల మీమ్స్.. వాళ్లను టార్గెట్ చేస్తున్న ట్రోల్స్

ఈ ఎడారి దాదాపు అంగారక (mars) గ్రహ ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అందుకే నాసా.. తన రోవర్లను ముందుగా.. ఈ ఎడారిలో నడిపి.. తర్వాత మార్స్ పైకి పంపుతుంది. అలాంటి ఎడారి ఇప్పుడు చెత్తకుప్పలా మారిపోతుండటం.. మనుషులు చేసుకుంటున్న దురదృష్టం అనుకోవచ్చు.

First published:

Tags: Chile, International news

ఉత్తమ కథలు