• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • AT LEAST FIVE KILLED 70 MISSING AS LANDSLIDES HIT GOLD MINE IN INDONESIA SK

Indonesia: బంగారు గనుల్లో ఘోర ప్రమాదం.. కార్మికులు సజీవ సమాధి

Indonesia: బంగారు గనుల్లో ఘోర ప్రమాదం.. కార్మికులు సజీవ సమాధి

ప్రతీకాత్మక చిత్రం

ఘటనా స్థలంలో ప్రొక్రెయిన్లతో మట్టి దిబ్బలను తొలగించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు.

  • Share this:
    ఇండోనేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గనిలో కొండ చరియలు విరిగిపడి కార్మికులు సజీవ సమాధి అయ్యారు. సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని పరిగి మౌంటాంగ్ డిస్ట్రిక్ట్ బురంగా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కార్మికులతో పాటు పలువురు గ్రామస్తులు సజీవ సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రొక్రెయిన్లతో మట్టి దిబ్బలను తొలగించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు.


    గల్లంతైన వారంతా మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయి ఉంటారని.. పలువురు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు బురంగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారిని తలచుకొని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు