Peshawar Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు... 7గురు మృతి, 70కి గాయాలు...

Peshawar Blast: పాముకు పాలు పోస్తే... అది యజమానినే కాటేసిందనేది మనం చిన్నప్పుడు చదువుకున్నదే. పాకిస్థాన్ విషయంలో అదే జరుగుతోంది. తాను పెంచే ఉగ్రవాదమే తనకు శాపమవుతోంది.

news18-telugu
Updated: October 27, 2020, 11:11 AM IST
Peshawar Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు... 7గురు మృతి, 70కి గాయాలు...
Peshawar Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు... 7గురు మృతి, 70కి గాయాలు... (credit - twitter)
  • Share this:
Peshawar Blast: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పెషావర్‌... దిర్ కాలనీలోని కోహార్ట్ రోడ్డుపై బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఓ మదర్సా దగ్గర జరిగిన ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో... స్పాట్‌లో ఏడుగురు చనిపోగా... మరో 70 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారందరనీ పెషావర్‌లోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తరలించారు. తెల్లవారు జామున ఈ పేలుడు సంభవించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) మనసూర్ అమన్ స్పష్టం చేశారు. "మదర్సా దగ్గర పేలుడు జరిగినప్పుడు... అక్కడ ఎవరో... ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాలు ఉంచారు." అని పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు... రాయిటర్స్ తెలిపింది. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ మరిన్ని వివరాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆ ఏరియాను పోలీసులు చుట్టుముట్టారు. భారీ ఎత్తున అక్కడ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.


పేలుడు ఎందుకు జరిగింది? అది ఏ పేలుడు పదార్థం? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? దీని వెనకున్న ఉగ్రవాదులు ఎవరు? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు.

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా అయిన తర్వాత... గత ప్రధానుల లాగే... ఆయన కూడా పాకిస్థాన్ ఆర్మీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ... తెరవెనక ఉగ్రవాదులకు ఊతం ఇస్తోందనీ... సరిహద్దుల నుంచి భారత్ వైపు ఉగ్రావాదుల్ని పంపిస్తోందనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. ఐతే... ఇలా పాకిస్థాన్ ఆర్మీ ద్వారా ఆ దేశంలో తల దాచుకుంటున్న ఉగ్రవాదులు... అప్పుడప్పుడూ అదే పాకిస్థాన్‌పై దాడులకు దిగుతున్నారు. ఇదివరకు కూడా కరాచీ, ఇతర నగరాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఓ దశలో పాకిస్థాన్ అణ్వాయుధాలను తమ వశం చేసుకోవాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇంత జరిగినా... పాక్ పాలకుల తీరు మారట్లేదు. ఫలితంగా ఇలా ఏ సంబంధమూ లేని సామాన్య ప్రజలు... ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం కన్నీరే మిగులుతోంది.
Published by: Krishna Kumar N
First published: October 27, 2020, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading