హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

gas tanker blast: గ్యాస్​ ట్యాంకర్​​ పేలి 62 మంది దుర్మరణం.. ఆసుపత్రిలో హాహాకారాలు.. ఘటన ఎలా జరిగిందంటే..?

gas tanker blast: గ్యాస్​ ట్యాంకర్​​ పేలి 62 మంది దుర్మరణం.. ఆసుపత్రిలో హాహాకారాలు.. ఘటన ఎలా జరిగిందంటే..?

హైతీ (Haiti) దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​గ్యాస్ ట్యాంకర్ పేలి (gas tanker blast) 62 మందికిపైగా దుర్మరణం (At least 62 people were killed) చెందారు.

హైతీ (Haiti) దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​గ్యాస్ ట్యాంకర్ పేలి (gas tanker blast) 62 మందికిపైగా దుర్మరణం (At least 62 people were killed) చెందారు.

హైతీ (Haiti) దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​గ్యాస్ ట్యాంకర్ పేలి (gas tanker blast) 62 మందికిపైగా దుర్మరణం (At least 62 people were killed) చెందారు.

  హైతీ (Haiti) దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో​ గ్యాస్ ట్యాంకర్ పేలి (gas tanker blast) 62 మందికిపైగా దుర్మరణం (At least 62 people were killed) చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం హైతీలోని క్యాప్-హైటియన్ నగరంలో (Haitian city of Cap-Haitian) జరిగింది. ఈ ఘటనను స్థానిక డిప్యూటీ మేయర్‌ పాట్రిక్ అల్మోనోర్ (Deputy Mayor Patrick almonor )ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశానంటూ పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు కారణంగా సంభవించిన మంటలు అంటుకొని దాదాపు 40 ఇళ్లు కూడా కాలిపోయినట్లు (40 houses in the area were also set ablaze) ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని.. ఇంకా చాలామంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు.

  హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ మాట్లాడుతూ..

  ఈ ఘటన (gas tanker blast)పై హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ (Prime Minister Ariel Henry) స్పందించారు. క్యాప్ హైతీయన్ (Haitian )సిటీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు ఘటన దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను భావోద్వేగం చెందానని అన్నారు. ఈ ఘటనలో చాలా మంది మరణించారని చెప్పారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని వివరించారు. దేశంలో మూడు రోజులు సంతాప దినం పాటిస్తుందని అన్నారు.

  ఎలా జరిగింది..?

  మంగళవారం ఉదయం క్యాప్ హైతీయన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ వేగంగా వెళ్తుండగా ఎదురుగా మరో వాహనం (motorcycle taxi) వచ్చిందని పాట్రిక్ చెప్పారు. ఆ వాహనన్ని తప్పించే క్రమంలోనే ట్యాంకర్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని వివరించారు. అప్పుడే ఆ ట్యాంకర్ తలకిందులై బోల్తా కొట్టి ఉంటుందని అన్నారు. బోల్తా పడ్డ ఆ ట్యాంకర్ నుంచి చమురు లీక్ (Oil leaked) అయిందని వివరించారు. ఆ రోడ్డు అంతా వరద పారిందని పాట్రిక్ పేర్కొన్నారు.

  రోడ్డుపై చమురు పడటంతో..

  రోడ్డుపై పడిన చమురు (Oil)ను పాదచారులు సేకరించడానికి పరుగున వచ్చారని తెలిసిందని  పాట్రిక్స్​ చెప్పారు. అప్పుడే అనుకోకుండా అక్కడ మంటలు వ్యాపించాయని (gas tanker blast), చాలా విస్తీర్ణం మేరకు చమురు (Oil) వ్యాపించి ఉండటంతో మంటల ప్రభావం తీవ్రమైందని పాట్రిక్ అన్నారు. 62 మందికి పైగా మృతి చెందినట్లు తెలిపారు. అంతేకాకుండా 40కి పైగా ఇళ్లు కాలిపోయాయని పాట్రిక్​ అన్నారు.

  యూనివర్సిటీ ఆసుపత్రిలో బాధితులు..

  ఈ ఘటన  (gas tanker blast) జరిగిన అనంతరం జస్టినియన్ యూనివర్సిటీ హాస్పిటల్‌ పేషెంట్లతో నిండిపోయింది. ఈ పేలుడు (gas tanker blast)లో గాయపడ్డ చాలా మంది ఈ హాస్పిటల్ చేరారు. ఇందులో చాలా మంది సీరియస్ కండీషన్‌లో ఉన్నారు. కాగా, ఆసుపత్రిలో బాధితులు హాహాకారాలు పెట్టారు. తమ వారిని రక్షించండంటూ బతిమిలాడుతున్నారు. అయితే సీరియస్ కండీషన్‌లో ఉన్న పేషెంట్లు అందరినీ కాపాడే సామర్థ్యం తమ దగ్గర లేదని అక్కడి వైద్య సిబ్బంది పేర్కొనడం హైతీ ధీన స్థితిని తెలియజేస్తుంది.

  First published:

  Tags: Gas blast, Haiti, LPG Cylinder

  ఉత్తమ కథలు