Home /News /international /

AT LEAST 45 PEOPLE INCLUDING 12 CHILDREN HAVE DIED AFTER A BUS CRASHED AND CAUGHT FIRE IN BULGARIA PRV

bus accident in bulgaria: బస్సులో మంటలు.. 45 మంది ప్రయాణికుల దుర్మరణం.. మృతుల్లో 12 మంది చిన్నారులు

మంటల్లో కాలిపోతున్న బస్సు (photo: KreatelyMedia/Twitter)

మంటల్లో కాలిపోతున్న బస్సు (photo: KreatelyMedia/Twitter)

ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి (bus accident in Bulgaria) గురయ్యింది. ఈ ఘటనలో 45మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

బల్గేరియా (Bulgaria) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు (bus) అగ్ని ప్రమాదానికి (bus accident in Bulgaria) గురయ్యింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు (children) కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. రాజధాని సోఫియా (sofia) కు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటర్‌వేలో (Bosnek, south-west of the capital Sofia) తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదం జరిగి 45 మరణించారని ఆ దేశ విపత్తు నియంత్రణ సేవ అధిపతి నికోలాయ్ నికోలోవ్ (Nikolai Nikolov, head of the country's disaster control service) చెప్పారు. ఏడుగురు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డవారిని రాజధానిలోని ఆసుపత్రికి తరలించారని నికోలోవ్ చెప్పారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు, చిన్నారులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

బల్గేరియా రాజధాని సోఫియా (sofia) నుంచి పర్యాటకులతో (tourists) బయలుదేరిన ఓ బస్సులో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బోస్​నెక్​ వద్ద (Bosnek, south-west of the capital Sofia) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 45 మంది ప్రాణాలు (45 members dead) కోల్పోయారు.

బస్సులో మృతదేహాలు (dead bodies) ఓ కుప్పగా.. బూడిదగా మారాయని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్‌ (Bulgarian Interior Minister Boyko Rashkov) పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనను ఇదివరకెన్నడూ చూడలేదన్న ఆయన.. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం (bus accident in Bulgaria)పై దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు.. సాంకేతిక లోపంతో (technical failure) జరిగిందా? లేక డ్రైవర్‌ తప్పిదమా? అనే రెండు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్‌ యానెవ్‌ (Bulgaria’s interim Prime Minister Stefan Yanev) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ (Kyriakos Mitsotakis)  సైతం విచారం వ్యక్తం చేశారు.





కిరియాకోస్ మిత్సోటాకిస్ మాట్లాడుతూ..  "ఈ తెల్లవారుజామున బల్గేరియాలో జరిగిన ఘోర ప్రమాదం (bus accident in Bulgaria), ప్రాణనష్టం, ముఖ్యంగా చిన్నపిల్లల గురించి నేను పూర్తిగా భయపడిపోయాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రార్థనలు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని అన్నారు.

ప్రమాదం (bus accident in Bulgaria) జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలం నుంచి దట్టమైన, నల్లటి పొగలు కమ్ముకోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. నార్త్ మెసిడోనియాలో రిజిస్టర్ అయిన ఈ బస్సు ఇస్తాంబుల్ నుంచి స్కోప్జే వెళ్తోందని పోలీసులు తెలిపారు. కాగా, యూరోపియన్ కమిషన్ డేటా ప్రకారం, 2019లో 7 మిలియన్ల EU దేశమైన బల్గేరియా, 27-దేశాల కూటమిలో రెండవ అత్యధిక రోడ్డు మరణాల రేటు నమోదు చేసుకుంది. ప్రతి మిలియన్ జనాభాకు 89 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bus accident, Buses, Children, Died, Fire Accident

తదుపరి వార్తలు