హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇరాన్‌లో మరో విషాదం.. ఖాసిం అంతిమయాత్రలో 35 మంది మృతి

ఇరాన్‌లో మరో విషాదం.. ఖాసిం అంతిమయాత్రలో 35 మంది మృతి

ఖాసిం సొలోమానీ స్వస్థలం కేర్మన్‌లో జరిగిన అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తండోపతండాలు కదలివచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందని ఇరాన్ స్టేట్ టీవీ మంగళవారం తెలిపింది.

    జనరల్ ఖాసిం సొలోమానీ హత్యతో ఇరాన్‌ ఇప్పటికే శోకసంద్రంలో మునిగింది. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం జరిగింది. ఖాసిం సొలోమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 35 మంది చనిపోయారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. మంగళవారం సొలోమానీ మృతదేహాన్ని ఆయన స్వస్థలం కేర్మన్‌కు తీసుకెళ్లారు. అక్కడ జరిగిన అంతిమయాత్రకు జనం భారీగా పాల్గొన్నారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తండోపతండాలు కదలివచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందని ఇరాన్ స్టేట్ టీవీ మంగళవారం తెలిపింది. ఇక సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు సొలోమానీ మృతదేహం తీసుకెళ్లారు. ఇస్లామిక్ రివల్యూషనరీ కూడలి వద్ద ఆయనకు నివాళి అర్పించేందుకు సుమారు 10 లక్షల మంది తరలివచ్చారు.

    ఈ నెల 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇరానియన్ జనరల్ ఖాసీం, ఆయన సలహాదారుణ్ని అమెరికా భద్రతా బలగాలు హతమార్చాయి. రాకెట్ దాడి చేసి చంపేశాయి. ఇరాక్‌లోని అమెరికా భద్రతా దళాలను ఖాసీ చంపుతున్నారని.. తమ బలగాలను చంపేందుకు కుట్రలు చేశారని ట్రంప్ ఆరోపించారు. అందుకే ఆయన్ను మట్టుబెట్టినట్లు అమెరికా తెలిపింది. సొలోమానీ మృతితో యావత్ ఇరాన్ విషాదంలో మునిగిపోయింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన ఎలైట్ ఖడ్స్‌కి హెడ్‌గా పనిచేసిన ఆయన... విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. సొలోమానీ హత్య తర్వాత ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.

    First published:

    Tags: America, Iran

    ఉత్తమ కథలు