హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Colombia Bus Accident: నడిరోడ్డుపై బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులు దుర్మరణం

Colombia Bus Accident: నడిరోడ్డుపై బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులు దుర్మరణం

బస్సు ప్రమాదం (Image:Twitter)

బస్సు ప్రమాదం (Image:Twitter)

Colombia Bus Accident: దట్టమైన పొగ మంచు ఉండడం వల్ల.. హైవేపై ఓ మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు, అతివేగంతోనే బస్సు అదుపు తప్పిందని పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Colombia Road Accident) జరిగింది. శనివారం నైరుతి కొలంబియాలోని పాన్-అమెరికన్ హైవేపై బస్సు బోల్తా (Colombia Bus Accident) పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. కొలంబియాలోని నైరుతి నగరాలైన పాస్టో, పోపాయాన్ మధ్య ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొలంబియాలోని నైరుతి మూలలో ఉన్న ఓడరేవు నగరం తుమాకో నుంచి.. ఈశాన్య ప్రాంతంలోని కాలి అనే ప్రాంతానికి వెళ్తుండగా.. బస్సు ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 320 కిలోమీటర్లు (200 మైళ్ళు) దూరం ఉంది.

బోల్తా పడిన బస్సును సరిచేయడానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి దాదాపు 9 గంటల సమయం పట్టింది. అనంతరం బస్సు నుంచి మృతదేహాల నుంచి బయటకు తీశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో.. రోడ్డుకు అడ్డంగా బస్సు పడిపోవడంతో.. దాదాపు 10 గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి.

నడిరోడ్డుపై కాలిపోయిన బస్సు.. 21 మంది సజీవ దహనం.. మృతుల్లో 12 మంది పిల్లలు

దురదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది మరణించారని నారియో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ కెప్టెన్ ఆల్బర్ట్‌ల్యాండ్ అగుడెల్లో తెలిపారు . బస్సులో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బ్రేక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం ఏర్పడే అవకాశాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నామని ట్రాఫిక్ రవాణా డైరెక్టర్ కల్నల్ ఆస్కార్ లాంప్రియా మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ మంచు ఉండడం వల్ల.. హైవేపై ఓ మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు, అతివేగంతోనే బస్సు అదుపు తప్పిందని పేర్కొన్నారు.

First published:

Tags: Bus accident, International, International news, Road accident

ఉత్తమ కథలు