కెనడాలో భారతీయ రెస్టారెంట్ దగ్గర పేలుడు

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:51 PM IST
కెనడాలో భారతీయ రెస్టారెంట్ దగ్గర పేలుడు
  • News18
  • Last Updated: June 6, 2018, 3:51 PM IST
  • Share this:
మిస్సిస్సాగా: కెనడాలోని ఓ భారతీయ రెస్టారెంట్ ముందు పేలుడు సంభవించింది. టొరంటో శివారులోని మిస్సిస్సాగాలో బాంబే బెల్ రెస్టారెంట్ దగ్గర జరిగిన ఈ ఘటనలో సుమారు15 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పీల్ రీజినల్ పోలీసులు ట్విటర్ లో వెల్లడించారు.







గురువారం రాత్రి పదిన్నర ప్రాంతంలో పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, నెల రోజుల క్రితం టొరంటోలో ఓ వ్యాన్ బీభత్సం స్రుష్టించింది. అతి వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లడంతో 10 మంది చనిపోగా, మరో 15 మందికి గాయాలైన విషయం తెలిసిందే.
Published by: Shiva Kumar Addula
First published: May 25, 2018, 5:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading