Home /News /international /

AT LEAST 14 KILLED INCLUDING 7 CHILDREN AFTER FLOODS IN LANDSLIDES IN BRAZIL RIO DE JANEIRO STATE PVN

Floods : బ్రెజిల్ లో ఆకస్మిక వరదలు..7గురు చిన్నారులు సహా 14మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Brazil Floods : బ్రెజిల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. రియో డీ జెనీరో రాష్ట్రంలో గత రెండురోలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు.

Brazil Floods : బ్రెజిల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. రియో డీ జెనీరో రాష్ట్రంలో గత రెండురోలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు. మృతి చెందనవారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా రియో​రాష్ట్రం వెంబడి తీరప్రాంత పట్టణాలు, నగరాలు ముంపునకు గురయ్యాయి. సముద్ర తీర పట్టణమైన కలోనియల్‌, పర్యాటక ప్రాంతమైన పారాటీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పారాటీలో ఒక రోజులో 322 మిమీ (12.68 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. ఇది ఆరు నెలల సగటు వర్షపాతం.

భారీ వరదల ధాటికి ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తల్లి సహా ఎనిమిది చిన్నారులు సజీవ సమాధి అయ్యారని స్థానిక అధికారులు చెప్పారు. మరో ఐదురుగు వరదల్లో కొట్టుకుపోయారని వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. వానలు ఇంకా తగ్గకపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటక కేంద్రమైన పారాటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీపంలోని తీరప్రాంత నగరమైన అంగ్రా డాస్ రెయిస్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వసం అయ్యాయి. దీంతో అధికారులు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని హెచ్చరించారు.

ALSO READ Pak Updates : పాకిస్తాన్ లో మ్యాజిక్..ఇమ్రాన్ ఖాన్ సేఫ్..అవిశ్వాస తీర్మానం రద్దు

వరదల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 144 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహాయం చేసేందుకు సైనిక విమానాలను పంపినట్లు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తెలిపారు. ఇప్పటికే నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ సెక్రెటరీ అలెగ్జాండర్‌ బాధిత ప్రాంతాలకు చేరుకున్నారని వెల్లడించారు

కాగా, మరో రెండు రోజులపాటు రియో డీ జెనీరో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరువారాల క్రితం ఇదే రాష్ట్రంలో కురిన వానల ధాటికి మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో 233 మంది చనిపోయారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Brazil, Died, Floods

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు