బార్‌లో కాల్పుల బీభత్సం..కాలిఫోర్నియాలో 13 మంది మృతి

బార్డర్ లైన్ బార్‌లో మ్యూజిక్ నైట్ ఈవెంట్ జరుగుతున్న క్రమంలో ఈ కాల్పులు జరిగాయి. బార్‌లోకి చొరబడిన సాయుధుడు..వస్తూనే అక్కడున్న జనాలపై తూటాల వర్షం కురిపించాడు.

news18-telugu
Updated: November 8, 2018, 5:25 PM IST
బార్‌లో కాల్పుల బీభత్సం..కాలిఫోర్నియాలో 13 మంది మృతి
బార్ వద్ద మోహరించిన పోలీసులు
news18-telugu
Updated: November 8, 2018, 5:25 PM IST
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి రక్తపుటేరులు పారించింది. అమాయక ప్రాణాలను బలితీసుకుంది. కాలిఫొర్నియాలోని థైజెండ్ ఓక్స్‌లో ఓ సాయుడు మారణహోమం సృష్టించాడు. ఓ బార్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో 12 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు సైతం చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:20గంటల సమయంలో ఘటన జరిగింది. బార్డర్ లైన్ బార్‌లో మ్యూజిక్ నైట్ ఈవెంట్ జరుగుతోంది. వందలాది విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా బార్‌లోకి చొరబడిన సాయుధుడు..అక్కడున్న జనాలపై తూటాల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో చాలా మంది పరుగులు తీశారు. కిటికీల అద్దాల పగులగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు టాయిలెట్లో తలదాచుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఐతే అప్పటికే బుల్లెట్లు తగిలి పలువురు కుప్పకూలారు. ఘటనపై కాలిఫొర్నియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు అక్టోబరు 27న పీట్స్‌బర్గ్ సిటీలో యూదుల ప్రార్థనాలయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తుపాకీ సంస్కృతితోనే ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...