హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Trump VS Biden: ట్రంప్ మళ్లీ గెలుస్తాడా ? మన జ్యోతిష్కులు ఏం చెబుతున్నారు ?

Trump VS Biden: ట్రంప్ మళ్లీ గెలుస్తాడా ? మన జ్యోతిష్కులు ఏం చెబుతున్నారు ?

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

Donald Trump VS Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిదని మన జ్యోతిష్కులు అంచనా వేస్తున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

  అమెరికాలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. తనదైన వ్యవహారశైలితో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడా ? లేక బైడెన్ ట్రంప్‌కు షాక్ ఇచ్చి కొత్త అధ్యక్షుడి ఎన్నికవుతాడా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. సర్వేలు ఈసారి ట్రంప్‌కు షాక్ తప్పవని అంటున్నాయి. అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ కంటే బైడెన్ దూసుకుపోతున్నాడని చెబుతున్నాయి. అయితే అఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని... బైడెన్ కంటే వెనుకబడ్డ ట్రంప్ మళ్లీ రేసులో ముందుకొచ్చే అవకాశం లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

  ఈ తరుణంలో అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిదని మన జ్యోతిష్కులు అంచనా వేస్తున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. బీహార్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు, ఆర్జేడీ మాజీ అధికార ప్రతినిధి శంకర్ చరణ్ త్రిపాఠి ఈసారి ట్రంప్‌కు విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆయన జతకం ప్రకారం.. ఆయన మరోసారి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీజేపీ నేత అవధత్ వాగ్ సైతం ట్రంప్ గెలవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన జాతకచక్రాన్ని బట్టి ఈసారి కూడా ఆయనే విజేత అవుతారని అంచనా వేశారు.


  ఇక ముగ్గురు హిందూ జ్యోతిష్కులతో మాట్లాడిన గల్ఫ్ న్యూస్... అందులో ఇద్దరు ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయమని చెప్పినట్టు వెల్లడించింది. ఆయనే అమెరికా 46వ ప్రెసిడెంట్ అవుతారని పేర్కొంది. ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రాడామస్ సైతం మరోసారి ట్రంప్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. జ్యోతిష్కుల అంచనాలు ఎలా ఉన్నా.. ఓపీనియన్ పోల్స్ మాత్రం జో బైడెన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. మరి.. ట్రంప్ విషయంలో మన జ్యోతిష్కుల అంచనాలే నిజమవుతాయా లేక ఓపీనియన్ పోల్స్ రైట్ అవుతాయా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: America, Donald trump, Joe Biden, US Elections 2020

  ఉత్తమ కథలు