Asteroid Apophis: 2068లో ఆ గ్రహశకలం భూమిని తాకుతుందా.. తాజా పరిశోధనలో ఆసక్తికర ఫలితాలు

ప్రతీకాత్మక చిత్రం

అపోఫిస్ భూమికి 17 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందని, దాని కచ్చితమైన దూరం 150 మీటర్లని తాము సమాచారాన్ని పొందగలిగామని రాడార్ క్యాంపైన్ కు నేతృత్వం వహించిన జేపీఎల్ శాస్త్రవేత్త మెరీనా బ్రోజవిక్ అన్నారు.

  • Share this:
భూమిని త్వరలో ఓ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టబోతుందని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అది భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని, అతి సమీపంలోనే ఉందని చాలా ఏళ్లుగా పలువురు నిపుణులు చెబుతున్నారు. భూమిని ఢీకొడుతుందని ఊహిస్తున్న ఆ ఆస్ట్రాయిడే అపోఫిస్. తాజాగా ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఇప్పుడప్పుడే లేదని నాసా బృందం తేల్చింది. 2068లో ఇది ఢీకొడుతుందనే అనుమానాలను పటాపంచలు చేస్తూ కనీసం 100 ఏళ్ల వరకు ఇది తాకే అవకాశమే లేదని ప్రకటించింది. తాజా రాడార్ పరిశీలనల్లో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు తేల్చారు.

తొలిసారిగా 2004లో..
అపోఫిస్ ను తొలిసారిగా 2004లో గుర్తించారు. 340 మీటర్ల పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం భూమికి విపత్తును తీసుకొస్తుందని చాలా మంది భావించారు. 2029 కల్లా ఇది భూమికి అతి దగ్గరగా వస్తుందని జోస్యం చెప్పారు. అయితే నియర్ ఎర్త్ అబ్జెక్ట్(ఎన్ఈఓ) పరిశోధకుల పరిశోధన ప్రకారం 2029లో దీని నుంచి ప్రమాదం లేదని, 2036 నాటికి భూమిని తాకే రిస్క్ ఉండొచ్చని అంచనా వేశారు. అనంతరం పరిశోధనల్లో అప్పుడు కూడా ప్రమాదం లేదని తేలింది. ఈ నెల ప్రారంభం వరకు 2068లో ఢీకొట్టేందుకు చిన్న అవకాశముందని అనుకున్నారు. కానీ తాజా పరిశోధనల్లో అది కూడా జరగదని ఉపశమనం కలిగించారు.
రాడార్ అబ్జర్వేషన్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు..

మార్చి 5న అపోఫిస్ ను పరిశీలించేందుకు శక్తిమంతమైన రాడార్ సంకేతికతను ఉపయోగించారు. సూర్యుడు చుట్టూ ఈ గ్రహశకలం కక్ష్య అంచనాను కచ్చితత్వంతో అంచనా వేయడానికి వీటిని ఉపయోగించారు. పలితంగా ఈ ఆస్ట్రాయిడ్ కనీసం 100 ఏళ్ల వరకు భూమిని తాకే అవకాశం లేదని చెప్పి, అందరికీ ఉపశమనం కల్పించారు. తాజా పరిశోధనతో 2068లో ప్రమాదం గురించి అంచనాలు పటాపంచయ్యాయి.
2068లో ప్రమాదం సంభవించే అవకాశం లేదని, కనీసం రాబోయే 100 ఏళ్ల వరకు ఈ గ్రహశకలం నుంచి ఎలాంటి ప్రమాదం లేదని నాసా సెంటర్ ఫర్ నియంర్ ఎర్త్ స్టడీస్ పరిశోధకులు డేవిట్ ఫర్నోచియా తెలిపారు. ఇటీవలే ఆప్టికల్ పరిశీలనల్లో అదపు రాడార్ అబ్జర్వేషన్ల మద్దతతో అపోఫిస్ ఆర్బిట్ నుంచి వందల కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిందని, 2029లో ప్రమాదముండదని తెలిపారు. కాబట్టి ప్రమాద జాబితా నుంచి అపోఫిస్ ను తొలగించవచ్చని తెలిపారు.





తాజా అంచనాల ప్రకారం అపోఫిస్ భూమికి 17 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందని, దాని కచ్చితమైన దూరం 150 మీటర్లని తాము సమాచారాన్ని పొందగలిగామని రాడార్ క్యాంపైన్ కు నేతృత్వం వహించిన జేపీఎల్ శాస్త్రవేత్త మెరీనా బ్రోజవిక్ అన్నారు.
First published: