• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • ASIAN HORNETS USA FIRST EVER NEST OF ASIAN GIANT HORNETS LOCATED IN A TREE CAVITY NK

Asian Hornets: తొలిసారి అమెరికాకు షాకిస్తున్న ఆసియా కందిరీగలు.. 2020లో మరో చిత్రం

Asian Hornets: తొలిసారి అమెరికాకు షాకిస్తున్న ఆసియా కందిరీగలు.. 2020లో మరో చిత్రం

తొలిసారి అమెరికాకు షాకిస్తున్న ఆసియా కందిరీగలు (credit - twitter)

Asian Giant Hornets: అక్టోబర్ 23న వాషింగ్టన్ వ్యవసాయ శాఖ అధికారులు... ఆసియా భారీ కందిరీగల తుట్టెను తమ దేశంలో చూశారు. అవి అమెరికాకు రావడం ప్రమాదకర సంకేతం అంటున్నారు.

  • Share this:
    Asian Giant Hornets: 2020లో మనం చాలా చిత్రాలు చూస్తున్నాం. కరోనా, మిడతల దాడి, కార్చిచ్చులు, వరదలు, గ్రహశకలాలు, తాజాగా ఈ లిస్టులో ఆసియా భారీ కందిరీగలు చేరాయి. ఇవి సాధారణ కందిరీగలు కావు. వీటికీ తేనెటీగలకూ అస్సలు పడదు. ఇవి తేనెటీగల కంటే మూడు రెట్లు పెద్దగా ఉంటాయి. అందువల్ల ఇవి అమెరికాలోని తేనెటీగలను చంపేస్తున్నాయి. వీటికి ఉన్న విషం వల్ల మనుషుల ప్రాణాలూ పోతున్నాయి. అందుకే వీటిని హంతక కందిరీగలు (Killer Hornets) అని కూడా అంటారు. అక్టోబర్ 23న ఓ చెట్టుకి ఉన్న ఆసియా కందిరీగల తుట్టెను వాషింగ్టన్ (Washington) వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చూశారు. బాస్కెట్ బాల్ సైజులో ఉన్న ఆ గూడులో... దాదాపు 200 కందిరీగలు ఉండటాన్ని గుర్తించారు. ఒక్కరోజులో దాన్ని నాశనం చేశారు. ఐతే... అవి మాత్రం అంతమైపోలేదు. కందిరీగల దాడి వల్ల ఆ ఏరియాలో 62 మంది చనిపోయినట్లు వ్యాధి నివారణ, నిరోధక కేంద్రం (సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌-CDC) తెలిపింది.


    ఉన్నట్టుండి ఈ కందిరీగల దాడి అమెరికాలో మొదలవ్వడంతో... అక్కడి రాష్ట్రాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. మన దేశంలో మిడతలు ఎలా దాడి చేశాయో... అలా ఈ కందిరీగలు దాడి చేయగలవు. ఐతే... ఇవి ఇప్పటివరకూ ఎప్పుడూ అమెరికాలో కనిపించలేదు. చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా, వియత్నాం సహా కొన్ని ఆసియా దేశాల్లో ఉండే ఈ విష కందిరీగలు 2019 డిసెంబరులో తొలిసారి అమెరికాలో కనిపించాయి. అప్పట్లో పెద్దగా వాటిని పట్టించుకోలేదు. తాజాగా మరోసారి వాషింగ్టన్ రాష్ట్రంలో కనిపించడంతో... కలకలం రేగింది. ప్రస్తుతానికి ఇవి వాషింగ్టన్‌ రాష్ట్రం, బ్రిటీష్‌ కొలంబియాలో మాత్రమే కనిపిస్తున్నాయి.


    ఈ కందిరీగలు ఎంత డేంజరంటే... కొన్ని కందిరీగలు గుంపుగా వచ్చి... ఓ పెద్ద తేనెతుట్టె (Beehive)ను కొన్ని గంటల్లోనే నాశనం చేసి... అందులోని తేనెటీగలను అన్నింటినీ చంపగలవు అని agr.wa.gov తెలిపింది.


    టెక్నాలజీలో ముందుండే అమెరికాకు... ఇప్పటివరకూ ఇలాంటి కందిరీగలను కనిపెట్టాల్సిన అవసరం రాలేదు. అందువల్ల అలాంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడా ఆ కందిరీగల్ని ట్రాక్ చేసే వ్యవస్థపై శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. రేడియో ట్రాకింగ్ (Radio Tracking) విధానాన్ని అమలుచేస్తున్నారు.


    తేనెటీగల్ని కందిరీగలు చంపేస్తే ఏమవుతుంది?:
    మనలో చాలా మంది తేనెటీగలు అంటే... ఓన్లీ తేనెను మాత్రమే సేకరిస్తాయి అనుకుంటారు. కానీ... అవి చేసే ఆ పని వల్ల... అవి ఏయే పువ్వులపై వాలుతాయో... ఆ పువ్వుల నుంచి పుప్పొడిని ఇతర పువ్వులకు చేర్చుతాయి. తద్వారా పువ్వులు కాయలుగా మారతాయి. లేదంటే... కాయలే రావు. తేనెటీగలే లేకపోతే... పండ్లు, కూరగాయలు ఏవీ ఉండవు. అందుకే... ఇప్పుడా కందిరీగల అంతు చూడటం అమెరికాకు సవాలుగా మారింది. ఇప్పటికే కరోనాతో నానా ఇబ్బందులు పడుతుంటే... ఇప్పుడీ సమస్య ఏంటని తలలు పట్టుకుంటున్నారు శాస్త్రవేత్తలు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు