Corona Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా...పలు దేశాల్లో హెల్త్ ఎమర్జన్సీ...

ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా చైనా దేశానికి రాకపోకలను నిషేధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

news18-telugu
Updated: January 23, 2020, 11:19 PM IST
Corona Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా...పలు దేశాల్లో హెల్త్ ఎమర్జన్సీ...
Corona Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా...పలు దేశాల్లో హెల్త్ ఎమర్జన్సీ...
  • Share this:
ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా నుంచి అమెరికా వరకు వ్యాపించిన ఈ వైరస్‌ అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సమావేశమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా చైనా దేశానికి రాకపోకలను నిషేధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. చైనా, థాయిలాండ్‌, జపాన్‌, అమెరికా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించింది. వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించింది. భారత్‌ లోని పలు విమానాశ్రయాల్లో 9,156 మంది ప్రయాణికులను పరీక్షించగా కరోనా వైరస్ కేసులు బయటపడలేదని వైద్యాధికారులు చెప్పారు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు