శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు : రాజపక్సే Vs సాజిత్, గెలుపెవరిది..?

హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు, యూకె,యూఎస్ విద్యావంతుడైన సాజిత్ తాజా ఎన్నికల్లో దాదాపు 160 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. యూఎన్‌పీ అభ్యర్థిగా సాజిత్‌ను నామినేట్ చేయకముందు ఆయన వాక్చాతుర్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారి ప్రచార పర్వంలోకి దిగాక.. తన పవర్‌ఫుల్ స్పీచులతో అటు ప్రత్యర్థులను,ఇటు సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేశాడు.

news18-telugu
Updated: November 15, 2019, 12:27 PM IST
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు : రాజపక్సే Vs సాజిత్, గెలుపెవరిది..?
సాజిత్ ప్రేమదాస,గొటబయ రాజపక్సే(Reuters)
  • Share this:
(DP Satish,South head, News18)

శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సుదీర్ఘ ఎన్నికల ప్రచారం అనంతరం అభ్యర్థులంతా ఇప్పుడు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే పనిని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అప్పగించారు.బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ దాదాపు మూడు అడుగుల పొడవు ఉన్నప్పటికీ, ప్రధానంగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) డిప్యూటీ లీడర్ సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి)కు చెందిన గోటబయ రాజపక్సే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు, యూకె,యూఎస్ విద్యావంతుడైన సాజిత్ తాజా ఎన్నికల్లో దాదాపు 160 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. యూఎన్‌పీ అభ్యర్థిగా సాజిత్‌ను నామినేట్ చేయకముందు ఆయన వాక్చాతుర్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారి ప్రచార పర్వంలోకి దిగాక.. తన పవర్‌ఫుల్ స్పీచులతో అటు ప్రత్యర్థులను,ఇటు సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేశాడు. అవినీతిమయమైన శ్రీలంక రాజకీయాల్లో సాజిత్ క్లీన్ ఇమేజ్ ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది.

కొలంబోలోని సంపన్న కుటుంబాల్లో సాజిత్ కుటుంబం ఒకటైనప్పటికీ.. విలాసాలకు ఆయన కాస్త దూరంగానే ఉన్నాడు. తన తండ్రి లాగే సామాన్యులతో భుజాలు రాసుకుని తిరిగాడు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చాడు. తన పాలనలో సమగ్ర అభివృద్దిపై దృష్టి పెడతానని చెప్పారు.ముఖ్యంగా పేదిరకం,గ్రామీణ ప్రజలపై ఎక్కువ దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. రాజపక్సే లాగా అవినీతికి పాల్పడకుండా పారదర్శక పాలన అందిస్తామన్నారు. రాజ్యాంగానికి లోబడి,ప్రజా స్వేచ్చకు,మీడియా స్వేచ్చకు విలువనిస్తానని భరోసా ఇచ్చారు.
ఇక మరో ప్రధాన అభ్యర్థి గొటబయ రాజపక్సే. ఈయన మాజీ రక్షణ కార్యదర్శి, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే తమ్ముడు.జాతీయ భద్రత,ఐక్యత పేరుతో గొటబయ రాజపక్సే ఓట్లు కోరుతున్నారు. 1948లో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం తర్వాత శ్రీలంకలో ఇప్పటికీ రెండు అంతర్యుద్దాలు జరిగాయి. గత ఏడాది జరిగిన ఈస్టర్ పేలుళ్లను ప్రస్తావిస్తూ.. యూఎన్‌పీ అధికారంలోకి వస్తే వ్యక్తిగత భద్రతకు హామీ ఉండదని ప్రచారం చేశారు.

ఇక దేశంలోని శక్తివంతమైన బౌద్ద మత పెద్దలు కూడా ఎవరికి మద్దతు అనే విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారు. కొంతమంది గొటబయ రాజపక్సేకు మద్దతునిస్తుంటే.. మరికొంతమంది సాజిత్‌కు మద్దతునిస్తున్నారు.అయితే గొటబయ రాజపక్సే అమెరికా పౌరసత్వంపై వివాదం నడుస్తోంది. తాను అమెరికా పౌరసత్వం వదులుకున్నట్టు రాజపక్సే చెబుతున్నప్పటికీ.. దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం అతని పోటీపై ప్రభావం
చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఉన్న అంచనా ప్రకారం.. దక్షిణ,సబరగమువా ప్రావిన్స్‌లో గొటబయ రాజపక్సే ఆధిక్యం కనబర్చే అవకాశాలు ఉన్నాయి. ఉవా,సెంట్రల్&నార్త్ ప్రావిన్స్‌లో సాజిత్‌తో ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. నార్తర్న్,ఈస్టర్న్&నార్త్-వెస్టర్న్ ప్రావిన్స్‌లలో సాజిత్ ఆధిక్యం కనబర్చే అవకాశం ఉంది. దేశ రాజధాని కొలంబోలో అత్యధిక జనాభా కలిగిన వెస్టర్న్ ప్రావిన్స్‌లో ఓట్ల కోసం ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం చేశారు.


ఇదిలా ఉంటే,మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున (జెవిపి) తమ అభ్యర్థిగా అనురా కుమార దిసానాయకను నిలబెట్టింది. అనురా దాదాపు 10లక్షల ఓట్లు తన ఖాతాలో వేసుకుంటాడని అంచాన వేస్తున్నారు. ఇక సివిల్ సొసైటీ అభ్యర్థిగా మాజీ ఆర్మీ చీఫ్ మహేష్ సేననాయకి కూడా బరిలో ఉన్నారు. కొంతమంది కొలంబో రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం..గత రెండు వారాల్లో జరిగిన పరిణామాలు సాజిత్‌కు అనుకూలంగా మారాయి. మెజారిటీ తమిళులు,ముస్లింలు ఆయనకు పెద్ద సంఖ్యలో ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు.

ఒకవేళ మెజారిటీ సింహళుల ఓట్లు గనుక గొటబయ రాజపక్సేకి దక్కితే సాజిత్‌ను ఆయన ఓడించే అవకాశం ఉందంటున్నారు.శ్రీలంక ఎన్నికల్లో మొదటిసారి రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తుండటంతో అభ్యర్థులకు ఆ భయం కూడా పట్టుకుంది. మొత్తం 22 మిలియన్ల జనాభా ఉన్న శ్రీలంకలో 16మిలియన్ల మందికి ఓటు హక్కు ఉంది. జాతీయ ఎన్నికల కమిషన్ అంచనా ప్రకారం 12-13మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.శనివారం ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుకానుంది. ఆదివారం ఉదయానికల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి.కాగా,శ్రీలంక చరిత్రలోనే మొదటిసారిగా సిట్టింగ్ అధ్యక్షుడు,ప్రధాని లేదా ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి.
First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు