ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ లేఖ.. ఐక్యరాజ్యసమితి స్పందన ఇదీ..

Article 370 | Mission Kashmir | UN | ఐరాస భద్రతా మండలి చీఫ్ జోవన్నా వ్రోనెక్కాను న్యూయార్క్‌లో జరిగిన మీడియా సమావేశంలో కోరగా ఆమె అందుకు నిరాకరించారు. విలేకరి ప్రశ్న వేయగానే ‘నో కామెంట్స్..’ అంటూ ఆమె వెళ్లిపోయారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 9, 2019, 11:37 AM IST
ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ లేఖ.. ఐక్యరాజ్యసమితి స్పందన ఇదీ..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 9, 2019, 11:37 AM IST
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ పాకిస్తాన్ యూఎన్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించాలని ఐరాస భద్రతా మండలి చీఫ్ జోవన్నా వ్రోనెక్కాను న్యూయార్క్‌లో జరిగిన మీడియా సమావేశంలో కోరగా ఆమె అందుకు నిరాకరించారు. విలేకరి ప్రశ్న వేయగానే ‘నో కామెంట్స్..’ అంటూ ఆమె వెళ్లిపోయారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘించడమేనంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కు ఈ లేఖ రాశారు.

మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సైతం భారత్ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిస్తామంటూ పార్లమెంటులో ప్రకటించారు.


First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...