AROUND 50 PERCENT CHINESE CITIZENS LIKE PM NARENDRA MODI GOVERNMENT REVEALS GLOBAL TIMES SURVEY BA
Narendra Modi: చైనాలో నరేంద్ర మోదీ సూపర్ క్రేజ్, సర్వేలో సంచలన విషయాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Chinese citizens like PM Narendra Modi | చైనా ప్రభుత్వ అధికారిక పత్రికగా పేరుపొందిన గ్లోబల్ టైమ్స్ నిర్వహించిన ఓ సర్వేలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనీయుల్లో 50 శాతం మంది అభిమానిస్తున్నారు.
Narendra Modi Craze in China | డ్రాగన్ దేశం చైనాలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా లేదు. చైనా ప్రభుత్వ అధికారిక పత్రికగా పేరుపొందిన గ్లోబల్ టైమ్స్ నిర్వహించిన ఓ సర్వేలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనీయుల్లో 50 శాతం మంది అభిమానిస్తున్నారు. తమ సొంత దేశంలోని జీ జిన్ పింగ్ ప్రభుత్వం కంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద చైనీయులు అభిమానం చూపిస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 50 శాతం మంది చైనీయులు మోదీని మెచ్చుకుంటున్నారు. మిగిలిన 50 శాతం మంది జీ జిన్ పింగ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ సర్వే ప్రకారం భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ బాగా పెరిగిందని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది మాత్రం చైనా, భారత్ మధ్య సంబంధాలు భవిష్యత్తులో మళ్లీ మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 25 శాతం మంది రెండు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘకాలం బలంగా ఉంటాయని భావించగా, 9 శాతం మంది మాత్రం అలా జరగకపోవచ్చని అంచనా వేశారు. మరోవైపు చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ హువాయ్ భారత్‌లోని ప్రముఖ పేపర్లతో భారీగా ప్రకటనలు జారీ చేస్తోంది. చైనాకు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజం భారత్‌తో తమ సంబంధాలు చాలా పాతవని, ఇండియా బాగు అభివృద్ధి కోసం తాము కష్టపడతామనే అభిప్రాయం కలిగించేలా ప్రకటనలు ఇస్తోంది. జమ్మూకాశ్మీర్‌లోని గాల్వాన్‌లో చైనా సైనికులతో ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా పలు దఫాల్లో 60కి పైగా చైనీస్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.